Acb submits status report on liquor raids

ACB submits status report on liquor raids,he Anti-Corruption Bureau submitted a status report in a sealed cover to the High Court

ACB submits status report on liquor raids

ACB.gif

Posted: 03/20/2012 05:48 PM IST
Acb submits status report on liquor raids

ACB submits status report on liquor raids

ఇప్పుడు రాష్ట్రంలో .. ఇనుము కు బాగా రేటు పెరిగిందని ప్రజలు అంటున్నారు. సడన్ గా ఇనుము రేటు ఎందుకు పెరిగిందని ఆరా తీస్తే.. ఏసీబీ , సీబిఐ వాళ్ల దెబ్బకు .. రేటు పెరిగిందని అంటున్నారు. అయిన వారికి ఇనుము తో పనేంటి అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు.

ఏమీలేదండీ.. కేసులు నిమిత్తం ముద్దాయిలపై వారు తయారు చేసిన రిపోర్టులను దాచుకోవటానికి .. ఇనుప ట్రంకు పెట్టెలు వాడుతున్నారట. అందువలన ఇనుము రేటు పెరిగిందని ప్రజలు అంటున్నారు. వీరు ఇలా ట్రంకు పెట్టెలు కోర్టు సమర్పించటం చూసిన కోర్టు వారు.. ఇక నుండి.. ట్రంకు పెట్టెలు తేవద్దు.. ఒక్క రిపోర్టు తెస్తే చాలు అని హైకోర్టు సూచించిందట.

మద్యం సిండికేట్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమర్పించిన నివేదిక కేసు విచారణకు సరిపోతుందని.. మిగిలిన డాక్యుమెంట్లు అవసరం లేదని హైకోర్టు ఏసీబీకి స్పష్టంచేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను ఇటీవల విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ కేసు విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించారు. దీంతోపాటు స్టేటస్ రిపోర్ట్‌కు మద్దతుగా దాదాపు 2,500 పేజీలతో కూడిన డాక్యుమెంట్లను రెండు ట్రంకుపెట్టెల్లో అందజేశారు. ఈ వ్యాజ్యాలను తాజాగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ కేసును విచారించేందుకు స్టేటస్ రిపోర్ట్ సరిపోతుందని, ఆ ట్రంకు పెట్టెలు వెనక్కి తీసుకెళ్లిపోవాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi parvathi fires on chandrababu
Telangana state governor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles