Cm kkr comments on kcr in mahabubnagar election campaign

CM KKR comments on KCR in Mahabubnagar election campaign, public meeting in Mahbubnagar,KCR, Telangana, Issue, MP KCR

CM KKR comments on KCR in Mahabubnagar election campaign

KCR01.gif

Posted: 03/16/2012 11:46 AM IST
Cm kkr comments on kcr in mahabubnagar election campaign

KCR exploits T for political gain

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే వ్యక్తి ఓ ఆకాంక్ష కోసం ఉద్యమం చేస్తున్నానని చెబుతూ అందరినీ పదవులకు రాజీనామాలు చేయమంటూనే ఆయన మాత్రం తన ఎంపి పదవికి రాజీనామా చేయకపోవడం ఏమిటని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు కారణమవుతూ కెసిఆర్ సాధించిందేమిటో ప్రజలు ఆలోచించుకోవాలని, కెసిఆర్ రాజీనామా చేస్తే మాజీ ఎంపిగా పిలవాల్సి వస్తుందనే భయం పట్టుకుందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిచిన కెసిఆర్ తనకు తెలిసినప్పటికి మూడు సంవత్సరాలలో 13 సార్లు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయని, ఆయన పార్లమెంట్‌లోకి వెళ్లి మాట్లాడరని, ప్రజలను 11 ఏళ్లుగా రెచ్చగొట్టి ఓట్లు వేయంచుకుంటూ పబ్బం గడుపుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. కరీంనగర్‌లో 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే పరాజయం పాలవుతానని తెలుసుకున్న కెసిఆర్ మహబూబ్‌నగర్‌కు వచ్చి పోటీ చేశారని, అయినప్పటికినీ ఏ మేరకు గెలిచారో అందరికి తెలుసని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahabubnagar by election kiran kumar reddy
Police seized rs 1 crore from tdp ex corporator  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles