Anand Mahindra tweets video of Hindu Temple of Dubai ఆనంద్ మహీంద్రా పంచుకున్న దుబాయ్ ‘హిందూ దేవాలయం’..

Anand mahindra tweets video of magnificent 70 000 sq ft hindu temple of dubai

dubai, anand mahindra, hindu temple of dubai, hindu temple UAE, Dubai Hindu Temple, Dubai government, Sheikh Nahyan bin Mubarak Al Nahyan, Minister of Tolerance & Coexistence, hindu temple UAE, mahindra, anand mahindra twitter, anand mahindra news, viral news

Industrialist Anand Mahindra shared the video of the Hindu Temple of Dubai, which was officially inaugurated on Wednesday. The temple is located in Jebal Ali Worship Village, an area which comprises 9 religious shrines of different faiths. The new temple is located adjoining the Gurudwara which was opened in 2012.

ITEMVIDEOS: ఆనంద్ మహీంద్రా పంచుకున్న దుబాయ్ ‘హిందూ దేవాలయం’..

Posted: 10/06/2022 02:47 PM IST
Anand mahindra tweets video of magnificent 70 000 sq ft hindu temple of dubai

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారని తెలుసు. తన సంస్థకు చెందిన అప్ కమ్మింగ్ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఆయన తన ఖాతాలో వేసే ప్రతీ పోస్టు.. క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. పకృతి ఓడిలో అందమైన సరోవరం మొదలుకుని ఆంతకుముందు.. ఆ తరువాత అన్నీ ఎంతో క్రియేటివిటీతో కూడుకుని,. అశ్చర్యం గోలుపడంతో పాటు ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన పోస్టు తన ఫాలోవర్స్ ను భక్తిపారవశ్యంలో ముంచింది.

తాజాగా ఆనంద్ మహీంద్రా దుబాయ్ లోని హిందూ ఆలయానికి సంబంధించిన వీడియోను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుబాయ్‌లో ఆధ్యాత్మిక నిలయమైన జీబెల్‌ అలీ గ్రామంలో హిందువుల ఆలయాన్ని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా.. తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయం ప్రారంభం సందర్భంగా భక్తుల కరతాల ధ్వనులు, డప్పు చప్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.  

ఈ కార్యక్రమంలో దుబాయ్‌ మంత్రి షేక్‌ నయాన్‌ బిన్‌ ముబారక్‌, యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అరబిక్ నిర్మాణ శైలులను మేళవించి ఈ ఆలయాన్ని నిర్మించారు. శివుడు పార్వతుల నుంచి విష్ణుమూర్తి, బ్రహ్మ, కృష్ణుడు, ఇతర దేవతామూర్తుల అవతారాలను ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఈ వీడియోను పోస్టు చేస్తూ ఆనంద్ మహీంద్రా ‘అత్యద్భుతం’ అని క్యాప్షన్ పెట్టారు. తాను త్వరలో దుబాయ్ వెళ్లనున్నానని, ఆ సమయంలో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్భిస్తానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పూజారులు ‘ఓం శాంతి శాంతి ఓం’ అని మంత్రాలు చదువుతుండగా.. భారతీయ తబలా, ఇతర వాయిద్యాలు మోగుతూ అలరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles