Pawan Kalyan Fans Bike Rally In Vemuru Vijrubhana వేమూరులో విజృంభించిన జనసైనికులు.. దిలిప్ బైరాకు బ్రహ్మరథం..

Dilip byra gets outstanding welcome by jana sainiks at vemuru vijrubhana

pawan kalyan, janasena, dilip byra, vemuru vijrubhana, jana sena vemuru vijrubhana, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan jana sena, jana sena dilip byra, guntur, andhra pradesh, politics

Actor turned politician power star pawan kalyan political party Jana Sena gets into people by conducting rallies in guntur, the party co-ordination committee member dilip byra gets a grand welcome at vemuru vijrubhana.

ITEMVIDEOS: వేమూరులో విజృంభించిన జనసైనికులు.. దిలిప్ బైరాకు బ్రహ్మరథం..

Posted: 09/10/2018 03:10 PM IST
Dilip byra gets outstanding welcome by jana sainiks at vemuru vijrubhana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు చాప కింద నీరులా తన ప్రచారాన్ని సాగిస్తున్న జనసేన పార్టీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దశలవారిగా ర్యాలీలు, సభలతో పార్టీని బూత్ స్ఠాయి నుంచి బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో స్థానిక నాయకులు తలపెట్టిన వేమూరు విజృంభన కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా కోఅర్డినేటింగ్ కమిటీ సభ్యుడు దిలిప్ బైరా ముఖ్య అతిధిగా హాజరకాగా, ఆయనకు వందలాది వాహనాలతో వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీలో ట్రాక్టర్లు, అటోలు, కార్లు, ఎస్ యూవీలతో జనసేన అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసే కార్యకర్తలు ఆ పార్టీ నేత దిలిప్ బైరాకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దిలిప్ బైరా మాట్లాడుతూ వేమూరు విజృంభన అన్నది స్థానిక నేతల నిర్వహించుకున్న కార్యక్రమం అని.. స్థానిక నేత కమలాకర్ అధ్వర్యంలో జనసైనికులు పెద్ద సంఖ్యలో దీనిని జయప్రదం చేశారని చెప్పారు.

అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడిని తీసుకురావడంలో ప్రతిపక్షం విఫలమయ్యాయని, అందుకు నిరసనగా వేమూరు విజృంభన నిర్వహించామన్నారు. దీంతో పాటు జనసేన పార్టీ బలపేతం దిశగా, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణ పునాదులు పటిష్టపర్చేందుకు కూడా తాము ఈ పర్యటనలతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సత్తెనపల్లి, నర్సారావు పేట, గురజాల, మాచర్ల, రేపల్లెలో తమ పార్టీ కార్యకర్తల కోసం వర్క్ షాపులు పెట్టి కార్యకర్తలకు అవగాహనసదస్సులు నిర్వహించామని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న పార్టీలకు జనసేన పార్టీకి వున్న వత్యాసాలు ఏమిటి.? జనసేన అవశ్యకత ప్రాధాన్యత.. ప్రజా సమస్యలపై జనసేన ఎలా దృష్టిసారిస్తుంది.. వాటిని ఎలా పరిష్కరిస్తుందన్న విషయాలను పార్టీ కార్యకర్తలు ప్రజలకు తెలియజేస్తారని, పార్టీ ప్రాధాన్యతా క్రమంలోని ఏడు సూత్రాలతో పాటు జనసేన మానిఫెస్టోను కూడా జనసైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలను కూడా రచిస్తామని చెప్పారు. మండల, గ్రామస్థాయిలలో కూడా పార్టీని బలోపేతం చేస్తున్నామని దిలిప్ బైరా చెప్పారు. ర్యాలీలు, నిరసన దీక్షలతో ప్రజలకు చేరువవుతూ.. వారి సమస్యలను తెలుసుకునేందుకు కూడా ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు.

ఓ వైపు అధికార పార్టీ ఎన్నికల ముందు తమ ఉనికి చాటుకునేందుకు అన్నా క్యాంటిన్లు, యువతకు నిరుద్యోగ భృతిని తీసుకువచ్చి వారిని దువ్వే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అదే క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రతిపక్ష పార్టీ అధినేత.. నిత్య యాత్రికుడి అవార్డు కోసం పర్యటిస్తున్నాడని విమర్శించారు. ఓ వైవు అవినీతి అరోపణలు ఎదర్కోంటూనే మరోవైపు తాజాగా అసెంబ్లీ టికెట్లను కూడా అమ్ముకుంటున్నాడని అరోపించారు. గుంటూరు జిల్లాలోనే అనేక అరోపణలు వెల్లువెత్తాయని, ప్రతిపక్ష పార్టీ నుంచి కేవలం బడా వ్యాపారులకు, పెట్టుబడిదారులకు మాత్రమే టికెట్లు లభిస్తున్నాయన్న అరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పార్టీలో ఇక విలువలతో కూడిన రాజకీయాలకు ఎక్కడ స్థానం వుంటుందని దిలిప్ బైరా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  vemuru vijrubhana  dilip byra  andhra pradesh  politics  

Other Articles

Today on Telugu Wishesh