హాంకాంగ్ క్వార్టర్స్ లోకి సైనా. సింధు Saina Nehwal, PV Sindhu enter Hong Kong Open badminton quarterfinals

Saina nehwal pv sindhu enter hong kong open badminton quarterfinals

Sindhu enter Hong Kong Open quarters, Saina enter Hong Kong Open quarters, Saina Nehwal, PV Sindhu, Hong Kong Open Badminton, Badminton, BWF Super Series

Saina Nehwal has entered the quarterfinal of the Kong Kong Open badminton championship on Thursday. In her second straight three-setter contest, Saina won 21-18, 9-21 and 21-16 in 51 minutes.

హాంకాంగ్ క్వార్టర్స్ లోకి సైనా. సింధు

Posted: 11/24/2016 06:32 PM IST
Saina nehwal pv sindhu enter hong kong open badminton quarterfinals

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి ముందుకు దూసుకెళ్తోంది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 18-21, 21-9, 21-16 తేడాతో పదకొండో ర్యాంకర్ సయాకా శాటో(జపాన్)పై గెలిచి క్వార్టర్స్ కు చేరింది. తొలి గేమ్లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఆ గేమ్లో పెద్దగా తప్పిదాలు ఆస్కారం ఇవ్వని సైనా 21-9 తో గెలిచింది. ఆ తరువాత నిర్ణయాత్మక మూడో గేమ్లో సయాకా నుంచి సైనాకు ప్రతిఘటన ఎదురైంది. కాగా, తను అనుభవాన్ని ఉపయోగించిన సైనా ఎట్టకేలకు సయాకను వెనక్కు నెట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్ తరువాత గాయం నుంచి కోలుకున్న సైనా చైనా ఓపెన్ సిరీస్ లో పరాభవాన్ని చవిచూసింది. దీంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో హాంకాంగ్ ఓపెన్ లోకి అడుగుపెటి వరుసగా రెండు గెలుపులను నమోదు చేసుకుంది. 2010లో హాంకాంగ్ ఓపెన్ను సైనా తొలిసారి గెలిచింది. మరోసారి హాంకాంగ్ ఓపెన్ సాధించి తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని సైనా భావిస్తోంది.

అటు రియో ఒలంపిక్స్ రజత పతక విజేత సింధూ కూడా క్వార్టర్ ఫైన్సల్స్ లోకి ప్రవేశించింది. తన ప్రత్యర్థి చైనీస్ తైపీ హయాచింగ్ పై కేవలం 36 నిమిషాలలో విజయాన్ని నమోదు చేసుకుంది. రెండు సెట్లలోనూ తన ప్రత్యర్థిపై సునాయాసంగా విజయాన్ని అందుకుని క్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 21-15, 11-21, 15-21 తేడాతో చాంగ్ వుయ్ ఫెంగ్(మలేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉండగా, సమీర్ వర్మ ప్రి-క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించాడు. సమీర్ 19-21, 21-15, 21-11 తేడాతో కజుమసా సాకాయ్(జపాన్)పై గెలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  PV Sindhu  Hong Kong Open Badminton  Badminton  BWF Super Series  

Other Articles