Gaurav Solanki settles for silver at the CWG Youth Games

Indian boxer gaurav solanki settles for silver

Boxing, Commonwealth Youth Games, CWG Youth Games, Gaurav Solanki, Indian boxer Gaurav Solanki, china, Asian common wealth games, India, Sports

Indian boxer Gaurav Solanki (52kg) lost to Australian Jack Bowen in the summit clash to settle for a silver medal in the Commonwealth Youth Games today.

బాక్సింగ్ లో గౌరవ్ సోలంకి వెండి పతకం

Posted: 09/10/2015 06:03 PM IST
Indian boxer gaurav solanki settles for silver

అపియా: కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ మరో వెండి పతాకన్ని తన ఖాతాలో వేసుకుంది. అమెరికా సామోన్ దీవుల్లోని అప్యా నగరంలో జరుగుతున్న కామెన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత బాక్సర్ గౌరవ్ సోలంకి- వెండి పతకం గెల్చుకున్నాడు. భారత్ తరపున బాక్సింగ్ విభాగంలోకి అడుగుపెట్టింది గౌరవ్ ఒక్కడే. అయితే అనుకున్న రీతిలో పతకాన్ని ముందుగానే ఖాయం చేసుకున్న గౌరవ్.. చివరి ఫైనల్స్ మ్యాచ్ లో ఓడినా వెండి పతాకన్ని మాత్రం సాధించాడు.

52 కిలోల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ జాక్ బొవెన్ చేతిలో 0-3 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో అతడికి వెండి పతకం దక్కింది. ఈ టోర్నిలో భారత్ తరపున గౌరవ్ సోలంకి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇదే విభాగంలో 49 కిలోల కేటగిరిలో భీంచంద్ సింగ్, 64 కిలోల విభాగంలో ప్రజ్ఞాన్ చౌహాన్ సెమీస్ లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. బాక్సింగ్ లో భారత్ కు మొత్తం మూడు పతకాలు దక్కాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian boxer  Gaurav Solanki  Asian common wealth games  India  

Other Articles