Pretoria high court judgement on south africa athlete oscar pistorius murder case

oscar pistorius, pretoria high court, oscar pistorius lover reeva steenkamp, oscar pistorius fires reeva steenkamp

pretoria high court judgement on south africa athlete oscar pistorius murder case

ప్రేయసిని హత్య చేశాడు.. కానీ చంపలేదు!?

Posted: 09/12/2014 01:00 PM IST
Pretoria high court judgement on south africa athlete oscar pistorius murder case

దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ 2013 ఫిబ్రవరి 14వ తేదీన తన ప్రియురాలిని హత్య చేసిన ఉదంతం అందిరికీ తెలిసిందే! అయితే ఈ కేసు విచారణ అప్పటినుంచి రకరకాల మలుపులు తిరుగుతూ వస్తోంది. తాను ఉద్దేశపూర్వకంగా తన ప్రేయసిని చంపలేదని... రాత్రివేళ ఎవరో దొంగ ఇంట్లో చొరబడ్డారనే ఉద్దేశ్యంతోనే వచ్చిందెవరో చూసుకోకుండా కాల్చి చంపానని ఈ ఆటగాడు వాదనను వినిపించిన నేపథ్యంలో... ఇతరులు అనేక అనుమానాలను వ్యక్తం చేసి ఇతనిపై కేసు వేసేశారు. తనకు, తన ప్రేయసి మధ్య వున్న కలహాల వల్లే ఆమెని చంపేశాడని.. అయితే తను చేసిన నేరం బయటపడకూడదనే భావనతో ఇలా కథలు అల్లుతున్నాడని.. ఎట్టిపరిస్థితుల్లోనూ అతనిని కఠినంగా శిక్షించాల్సిందేనని న్యాయవాదులు జడ్జిముందు సవాళ్లు పెట్టేశారు. ఇలా అప్పటినుంచి కొనసాగుతున్న ఈ కేసును చివరికి జడ్జి ఒక షాకింగ్ జడ్జిమెంట్ తో తుదిదశకు తీసుకొచ్చారు. పిస్టోరియస్ తన ప్రేయసిని చంపలేదని.. కానీ హత్యచేసింది అతడేనంటూ కన్ఫ్యూజన్ లో పెట్టేసింది.

ఏదైతేనేం.. చివరకు పిస్టోరియస్ కు కోర్టునుంచి ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రిటోరియా హైకోర్టు ఈ విషయంపై వివరణ చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా పిస్టోరియస్ హత్య చేసినట్లు నిరూపితం కాలేదు కాబట్టి అతనిపై హత్యానేరాన్ని కొట్టిపారేయడం జరిగింది’’ అని ఆయన తీర్పునిచ్చారు. అలాగే అత్యంత కఠినశిక్షలు పడే అభియోగాలను సైతం తోసిపుచ్చేశారు జడ్జి! ‘‘పిస్టోరియస్ హత్యకేసు స్పష్టంగా నిరూపితం కాలేదు. అతను ఉద్దేశపూర్వకంగా తన ప్రియురాలు రీవా స్టీన్ కాంప్ ను హత్యచేసినట్టు ఆధారాలు లేవు. తన చేతులారా ఒక హత్యజరుగుతుందని తాను ఊహించివుండడని.. తలుపు వెనకాల ఎవరో దొంగ అయి వుంటాడనే ఉద్దేశంతోనే తన ప్రియురాలిని కాల్చి చంపాడు. అయితే ఒక విధంగా తొందరపాటుతో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడని స్పష్టమవుతోంది’’ అంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడిన మరుక్షణమే కోర్టు రూమ్ లోనే పిస్టోరియస్ తల దించుకుని మౌనంగా రోదించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south africa athlete oscar pistorius  pretoria high court  reeva steenkamp  

Other Articles