Match fixing in brazil fifa world cup 2014

brazil fifa world cup 2014, football 2014 world cup, fifa world cup 2014, cameroon, world cup, fifa, fifa world cup, brazil 2014, match fixing

match fixing in brazil fifa world cup 2014

ఫిఫాలో ఫిక్సింగ్ భూతం

Posted: 07/02/2014 04:28 PM IST
Match fixing in brazil fifa world cup 2014

క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలు అయినా, ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీలు అయినా, ఐపీఎల్ మ్యాచ్ లు అయినా ఫిక్సింగ్ మాత్రం తప్పనిసరిగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో తిలకిస్తున్న ఫిఫా ఫుట్ బాల్ టోర్నీలకు కూడా ఫిక్సింగ్ భూతం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో లీగ్ దశ కూడా దాటకుండా ఇంటి ముఖం పట్టిన కామెరూన్ జట్టు పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ దేశం ఫుట్ బాల్ సంఘం జట్టులోని ఏడుగురు ఆటగాళ్ళ పై వస్తున్న ఆరోపణల పై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు కూడా ఆదేశించింది. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌పై ఎక్కువ అనుమానం ఉందని, జాతీయ జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లు నీతి నియమాలకు , ఆటలో విలువలకు విరుద్ధంగా వ్యవహరించారనే అనుమానం ఈ విచారణకు ఆదేశించినట్లు కామెరూన్ ఫుట్‌బాల్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచకప్‌కు అత్యధికంగా ఏడుసార్లు అర్హత సాధించిన ఆఫ్రికా జట్టు కామెరూన్. 1990లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. ఈసారి ప్రపంచకప్‌లో కామెరూన్‌కు ఆది నుంచి ఇబ్బందులే ఎదురయ్యాయి. బోనస్ వ్యవహారం పరిష్కరించేవరకు బ్రెజిల్ విమానం ఎక్కేదిలేదని ఆటగాళ్లు భీష్మించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కామెరూన్ మేటి ఆటగాడు శామ్యూల్ ఎటో పూర్తిస్థాయిలో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో 0-1తో మెక్సికో చేతిలో ఓడిన కామెరూన్... రెండో మ్యాచ్‌లో 0-4తో క్రొయేషియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 1-4తో బ్రెజిల్ చేతిలో ఓడిపోయింది. కామెరూన్‌ జట్టు పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని ‘ఫిఫా ’ తెలిపింది. ముందు ముందు మరెన్ని జట్లు ఈ ఫిక్సింగ్ భూతంలోకి వెళ్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles