Navdeep Saini joins Kent for overseas stint ఇంగ్లాండ్ కౌంటీల్లో నవదీప్‌ సైనీ.. ‘కెంట్‌’ తరఫున బరిలోకి..

Paceman navdeep saini to play eight games for english county kent

England County Cricket, India, pace bowler, Delhi cricketer, fast bowler, right-arm pacer, Navdeep Saini, Kent Cricket, County Championship, Royal London Cup matches, Kent Director of Cricket, Paul Downton, Cricket news, sports news, Cricket, sports

Kent Cricket is delighted to announce the signing of India international fast bowler Navdeep Saini for up to three LV= Insurance County Championship and five Royal London Cup matches, subject to visa and regulatory approval. The 29-year-old has represented his country in all forms of the game after making his IT20 debut for India in August 2019.

ఇంగ్లాండ్ కౌంటీల్లో నవదీప్‌ సైనీ.. ‘కెంట్‌’ తరఫున బరిలోకి..

Posted: 07/18/2022 07:05 PM IST
Paceman navdeep saini to play eight games for english county kent

భారత క్రికెటర్లకు విదేశాల్లో అవకాశాలు కలిసివస్తున్నాయి. కౌంటీ క్రికెట్ కు పేరెన్నిక కాబడ్డ ఇంగ్లండ్‌ లో మరో భారత పేస్‌ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్‌ నవదీప్‌ సైనీ ‘కెంట్‌’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్‌లో 3 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 5 వన్డేలలో అతను ‘కెంట్‌’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ఈ టీమ్‌కు ఆడనున్న రెండో భారత క్రికెటర్‌ సైనీ. తాజా సీజన్‌లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది.

ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్‌ యాదవ్‌ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్‌లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్‌ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles