టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని కాపాడండీ Don't 'overkill' day-night Tests - Nathan Lyon

Nathan lyon is happy with the success of day night tests but

Pakistan tour of Australia, Australia, Pakistan, Cricket, PAK tour of AUS 2016/17, Australia, Pakistan, News - UK Cricket

Nathan Lyon has urged cricket to avoid "overkill" in its scheduling of day-night Tests, as Australia prepare for their second of back-to-back pink-ball Tests this summer.

టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని కాపాడండీ

Posted: 12/13/2016 06:55 PM IST
Nathan lyon is happy with the success of day night tests but

టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా చోరవ తీసుకుని మరీ కాపాడాలని అస్ట్రిలియా స్పిన్నర్ నాథన్ లయాన్ అభిప్రాయపడ్డాడు. పింక్ బాల్తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ల నిర్వహణలో అతిగా వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ సలహా ఇచ్చాడు.  సంప్రదాయ టెస్టు క్రికెట్కు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదంటూనే, డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వల్ల అంతగా ఉపయోగం లేదన్నాడు.

ఎక్కువ శాతంలో డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నాట్టు చెప్పాడు. ఇప్పటికే అడిలైడ్లో నిర్వహించిన పింక్ బాల్ మ్యాచ్ మంచి సక్సెస్ అయ్యింది. కానీ టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని రక్షించడం కూడా ముఖ్యమే. పింక్ బాల్ తో గేమ్లు నిర్వహిస్తే టెస్టు క్రికెట్కు హాని జరిగే అవకాశం ఉంది. దాంతో పింక్ బాల్ గేమ్ను సాధ్యమైనంత తక్కువగా నిర్వహిస్తేనే మంచిది. డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై అతిగా వెళ్లకండని లయాన్ తెలిపాడు.

ఈ మేరకు వచ్చే ఏడాది యాషెస్ సిరీస్లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు సీఏ ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టాడు. యాషెస్లో డే అండ్ నైట్ టెస్టును తాను కోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతేడాది వేసవిలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్ లో తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వెస్టిండీస్-పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్లో డే అండ్ నైట్ టెస్టును నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ నాల్గో టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్ గా ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south africa  proteas cricketer  opener  formet cricketer  sid O linn  wicket keeper  cricket  

Other Articles