బౌలర్లు అయిపోయారు.. ఇక బ్యాట్స్ మెన్ దే... | Murali Vijay slams fifty as India stretch lead

Murali vijay slams fifty as india stretch lead

India vs New Zealand 1st test day 3, New Zealand pack up for 260, Ashwin Jadeja slammed Kiwis, Murali Vijay slams fifty as India stretch lead, 500 test updates

Murali Vijay slams fifty as India stretch lead.

అశ్విన్, జడేజా దెబ్బకి కివీస్ ప్యాకప్

Posted: 09/24/2016 04:18 PM IST
Murali vijay slams fifty as india stretch lead

భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, జడేజాల దెబ్బకు న్యూజిలాండ్ ఆటగాళ్లు బేర్ మన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ 318 పరుగులకు బదులుగా, ఒక వికెట్ నష్టానికి 152 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ సరిగ్గా 100 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టు 95.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ కు 56 పరుగుల లీడ్ లభించింది.

నేటి ఆటలో రోంచీ (38), శాంట్ నర్ (32)లు మినహా మరెవరూ పెద్దగా రాణించలేదు. సోధీ, బౌల్ట్, టేలర్ లు డక్కౌట్ కాగా, క్రెయిగ్ 2, వాట్లింగ్ 21 పరుగులు చేశారు. జడేజాకు 5, అశ్విన్ కు 4 వికెట్లు లభించగా, ఉమేష్ యాదవ్ కు ఒక వికెట్ లభించింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా ఆడుతోంది. ఒక వికెట్ నష్టానికి 36 ఓవర్లలో 134 పరుగులు చేసింది.

లోకేశ్ రాహుల్ 38 పరుగులు చేసి అవుట్ అవ్వగా, మురళి విజయ్ హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఎండ్ లో పుజారా 38 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. వరుణుడు అడ్డుకోకుంటే, ఈ మ్యాచ్ లో ఫలితం ఖాయంగా వస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  New Zealand  !st Test  Day 3  

Other Articles