Hashim Amla, Dwayne Bravo star in Trinbago Knight Riders thrilling CPL win

Amla bravo power knight riders to win over tridents

hashim amla, dwayne bravo, trinbago knight riders, caribbean premier league, barbados tridents vs trinbago knight riders, trinbago knight riders vs barbados tridents bravo, amla, amla runs, bravo runs, bravo wicket

Defending champions of the Caribbean Premier League, Shahrukh Khan’s Trinbago Knight Riders needed a home win to kickstart their campaign quickly after a loss in the their last game to St Lucia Zouks. And they got it,

సీపీఎల్ లో షారుఖ్ ఖాన్ జట్టు విజయం..

Posted: 07/02/2016 05:38 PM IST
Amla bravo power knight riders to win over tridents

కరీబియన్ లీగ్ లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భాగస్వామిగా ఉన్న 'ట్రినిబాగో నైట్ రైడర్స్' జట్టు ఆటగాళ్ల రికార్డు భాగస్వామ్యంతో తొలి విజయం సాధించింది. ఢిపెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన నైట్ రైడర్స్ కు గెలుపు అత్యంత అవశ్యం కాగా, బార్బొడోస్ ట్రిడెంట్స్ తో జరిగిన మ్యాచ్ లో దానిని అందుకున్నారు. బార్బొడోస్ ట్రిడెంట్స్, ట్రినిబాగో నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన షారూఖ్ జట్టు 20 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో స్టార్ ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా కేవలం 54 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కాగా అమ్లాకు అనదర్ ఎండ్ లో వున్న డ్వెన్ బ్రావో 66 పరుగులతో చక్కగా రాణించాడు. దీంతో వీరిద్దరి మద్య 92 బంతులలో 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదైంది. మొత్తంగా జట్టు స్కోరు 170 పరుగులు చేసింది. కాగా అమ్లా చివరి బంతికి అవుటవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. బార్బొడోస్ ట్రిడెంట్స్ పేసర్లు అఖీల్ హుస్సెన్, రవి రాంపాల్ ధీటైన బంతులతో టాప్ అర్ఢర్ ను దెబ్బతీశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బొడోస్ ట్రిడెంట్స్ జట్టు కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 171 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన బార్బొడోస్ ట్రిడెంట్స్ ధీటుగానే బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మిడిల్ అర్ఢర్ మాత్రం కుప్పకూలింది. కేవలం ఎనమిది బంతుల వత్యాసంతో నాలుగు ధీటైన విక్కెట్లను బార్బోడోస్ ట్రిడెంట్స్ చతికిల పడింది. అప్పటికి టెయిల్ ఎండర్స్ విజయం కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో ట్రినిబాగో నైట్ రైడర్స్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles