ధావన్ కి లైవ్ లోనే గడ్డిపెట్టాడు | Sourav Ganguly wants Shikhar Dhawan to fire in IPL final

Sourav ganguly wants shikhar dhawan to fire in ipl final

Shikhar Dhawan, Sourav Ganguly, IPL-9, శిఖర్ ధావన్, గంగూలీ, ఐపీఎల్ 9, క్రీడావార్తలు, లేటెస్ట్ న్యూస్, latest news, sports news

Time for Shikhar Dhawan to stand up Ganguly opined. Opener Shikhar Dhawan has managed just 473 runs in 16 games at an ordinary average of 39.41 - way below the standards for a player of his calibre.

ధావన్ కి లైవ్ లోనే గడ్డిపెట్టాడు

Posted: 05/28/2016 04:25 PM IST
Sourav ganguly wants shikhar dhawan to fire in ipl final

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ గత అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆకట్టుకున్న ఈ డాషింగ్ ప్లేయర్ ఈ సీజన్ లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ అనవసరంగా వికెట్ పారేసుకుంటున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన టీమిండియా లెజెండ్ బ్యాట్స్ మెన్ సౌరవ్ గంగూలీ  నువ్వు ఆడాల్సిన విధానం ఇది కాదంటూ ధావన్ కి క్లాస్ పీకాడు.

ఓ లైవ్ షోలో దాదా మాట్లాడుతూ... 'శిఖర్ ధావన్, ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడు' అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.  ఇప్పటిదాకా అయినా ఆడలేదు. కనీసం ఫైనల్లో అయినా జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. వార్నర్ ఒక్కడే ఆడితే ఫైనల్లో రాణించడం సులువు కాదని చెప్పాడు. టీమిండియాకు ధావన్ కీలకమైన బ్యాట్స్ మన్ అని చెప్పిన గంగూలీ, ఐపీఎల్ లో ఆ జట్టుకు కూడా ధావన్ కీలకమన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పాడు. ఫస్ట్ క్వాలిఫయర్, సెకెండ్ క్వాలిఫయర్ లో కూడా ధావన్ సరిగ్గా ఆడలేదని, కనీసం ఫైనల్లో ఆడి, వార్నర్ కు అండగా నిలబడతాడని ఆశిస్తున్నానని తెలిపాడు. కోల్ కతాతో, గుజరాత్ తో వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, బిపుల్ శర్మ అండతో మధురమైన విజయం అందించాడని గంగూలీ అభినందించాడు. కాగా, ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్ లు ఆడిన ధావన్ 473 పరుగులతో, 39.41 సగటుతో పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shikhar Dhawan  Sourav Ganguly  IPL season 9  

Other Articles