MS Dhoni Crossed Two IPL Milestones Even Though Rising Pune Supergiants Lost

Ms dhoni reaches yet another milestone

Dhoni, Indian Premier League, ipl, IPL 2016, ipl 9, MS Dhoni, Pune, Rising Pune Supergiants, 3000 runs club, stumpings, cricket,

Mahendra Singh Dhoni may be leading a new team in the Indian Premier League (IPL), but like before, he continues to knock off records both in front and behind the stumps.

మ్యాచ్ ఓడినా మైలు రాయిని అందుకున్న ధోని

Posted: 04/15/2016 08:03 PM IST
Ms dhoni reaches yet another milestone

భారత క్రికెట్లో తనదైన ముద్రవేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మూడు వేల పరుగుల మార్కును చేరిన ఆటగాళ్ల జాబితాలో ధోని స్థానం సంపాదించాడు. ఐపీఎల్-9లో భాగంగా గురువారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్బంగా ధోని 10 బంతుల్లో 22 పరుగులు చేశాడు. తద్వారా మూడు వేల పరుగుల మార్కును చేరిన ఏడో ఆటగాడిగా ధోని(3,010) గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకూ 131 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోని.. 117 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను సాధించాడు.

అంతకుముందు ఈ జాబితాలో సురేష్ రైనా(3,743), రోహిత్ శర్మ(3,476), గౌతం గంభీర్(3,235), విరాట్ కోహ్లి(3,212), క్రిస్ గేల్( 3,200), రాబిన్ ఉతప్ప(3,039)లు ఉన్నారు.  కాగా యావరేజ్లో మాత్రం ధోని(సుమారు 40.00) రెండో స్థానంలో ఉండగా, గేల్ (47.62) తొలిస్థానంలో నిలిచాడు.  మరోవైపు నిన్నటి మ్యాచ్ లో సురేష్ రైనాను ధోని స్టంపింగ్ చేసి దినేష్ కార్తీక్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం 24 స్టంపింగ్ లతో సమంగా ఉన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  IPL  cricket  3000 runs club  stumpings  

Other Articles