Rohit Sharma to co-own Wrestling league team UP Warriors

Rohit sharma co own wrestling league team up warriors

Cricket, Pro Wrestling League, Rohit Sharma, Sport ,UP Warriors, Wrestling, Dharmendra, Punjab, newly launched Pro Wrestling League, rohit sharma co-owner of the PWL team, rohit sharma co-owner UP Warriors

Indian cricketer Rohit Sharma became the latest celebrity to endorse the newly launched Pro Wrestling League as he was named as the co-owner of the PWL team UP Warriors

యూపీ వారియర్స్ రెజ్లింగ్ జట్ట అధినేత రోహిత్ శర్మ

Posted: 12/09/2015 05:56 PM IST
Rohit sharma co own wrestling league team up warriors

టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాడు రోహిత్ శర్మ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. నూతనంగా భారత్ దేశంలో అవిష్కరింబడిన ప్రో-రెజ్లింగ్ లీగ్ లో ఉత్తరప్రదేశ్ జట్టును కొనుగోలు చేశాడు. భారత్ లో ఆరు ప్రధాన నగరాలు కేంద్రంగా ఈ నెల 10వ తేదీ నుంచి ప్రో-రెజ్లింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ప్రో-రెజ్లింగ్ లీగ్ లో ఓ జట్టును ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర సొంతం చేసుకున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్ జట్టును రోహిత్ శర్మ మరో వ్యాపారవేత్తతో కలిసి కొనుగోలు చేశాడు.

కాగా, ఐఎస్ఎల్ జట్లను గంగూలీ, సచిన్, ధోనీ, కోహ్లీలు కొనుగోలు చేశారు. తాజాగా ప్రో-రెజ్లింగ్ జట్టును కొనుగోలు చేయడం ద్వారా రోహిత్ కొత్తగా స్పోర్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. భారత్ కు రెజ్లింగ్ లో మంచి రికార్డు ఉందని, యూపీ జట్టుకు సహయజమానిగా ఉండడం ఉత్కంఠకు గురి చేస్తోందని రోహిత్ పేర్కొన్నాడు. సుశీల్ కుమార్ తమ జట్టులో ఉండడం అదనపు బలమని చెప్పిన రోహిత్, టోర్నీలో ఛాంపియన్ గా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Pro Wrestling League  Dharmendra  Punjab  UP Warriors  

Other Articles