Chris Cairns 'asked Brendon McCullum to spot-fix matches'

Brendon mccullum shocked by chris cairns match fixing offer

chris cairns, chris cairns fixing, chris cairns match fixing, brendon mccullum, brendon mccullum on match fixing, brendon mccullum on spot fixing, brendon mccullum cairns, mccullum chris cairns, sports news, sports

Brendon McCullum said that Chris Cairns had masked his income from spot-fixing by using it to buy property.

ఫిక్సింగ్ కు పాల్పడాలని నన్ను కూడా కోరారు..

Posted: 10/16/2015 04:20 PM IST
Brendon mccullum shocked by chris cairns match fixing offer

క్రికెట్ ఆట ఆదరణ అంతాఇంతా కాదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఆటకు ఫక్సింగ్ ఆరోపణలు, బెట్టింగ్ ఘటన నేపత్యంలో ఆదరణ తగ్గుతుంది. గతంలో తమను మ్యాచ్ ఫక్సింగ్ కు అంగీకరించాలని ఒత్తడి చేశారని, అయోమమస్థితిలో అంగీకరించామని విన్సెంట్ భారత క్రీడాకారుడు దినేష్ మోంగియాపై అరోపణలు గుప్పించిన.. వారం రోజుల వ్యవధిలోనే మరో ఆటగాడు సరిగ్గా అలాంటి ఆరోపణలతో మరో బాంబు పేల్చాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ లోకి లాగేందుకు ప్రయత్నం జరిగిందని కోర్టుకు న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు.

మ్యాచ్ ఫిక్సింగ్  చేయాలని తన మాజీ సహచరుడు క్రిస్ కెయిన్ప్ తనను అడిగాడని తెలిపాడు. 2008, ఏప్రిల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా కోల్ కతా లోని ఓ హోటల్ లో కలిసినప్పుడు తనను ఫిక్సింగ్ లోకి లాగేందుకు కెయిన్స్ ప్రయత్నించాడని, అయితే అతడి ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదని లండన్ కోర్టులో వెల్లడించాడు. కెయిన్స్ ప్రతిపాదనతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఫిక్సింగ్ చేయాలని అదే ఏడాది రెండుసార్లు తనను కెయిన్స్ కోరాడని తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ గురించి పేపర్ పై రాసి మరీ వివరించాడన్నాడు. ఒక్కో స్పాట్ ఫిక్సింగ్ కు 70 వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశ పెట్టాడని వెల్లడించాడు. ఫిక్సింగ్  సొమ్ముతో కెయిన్స్  న్యూజిలాండ్ లో ఆస్తులు కూడబెట్టాడని తెలిపాడు. కెయిన్స్ వ్యవహారం గురించి 2011లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు మెక్ కల్లమ్ చెప్పాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris cairns  spot fixing  match-fixing  Brendon McCullum  New Zealand  

Other Articles