Sangakarra joins 400 odi club

Sangakarra joins 400 odi club, srilanka batsman Kumar Sangakkara, Kumar Sangakkara fourth player in 400 odi club, Kumar Sangakkara joins 400 one day match club, one day indternational matches, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Sangakkara Cricket, CWC 2015, bangladesh,

srilanka batsman Kumar Sangakkara became the fourth player to join in 400 one day match club against Bangladesh in world cup tournament

400 వన్డే క్లబ్‌లో చేరిన సంగక్కర..

Posted: 02/26/2015 07:32 PM IST
Sangakarra joins 400 odi club

క్రికెట్ ప్రపంచకప్‌ టార్నమెంటు లీగ్ దశలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా బంగ్లాదేశ్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌తో సంగక్కర 400 వన్డేలు ఆడిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరిపోయాడు. జట్టులో బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా పలు పాత్రలు పోషించాడు. ఈ 37ఏళ్ల శ్రీలంక ఆటగాడు తొలిసారి 2000 సంవత్సరంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. వన్డేల్లో ఇప్పటివరకు 21 సెంచరీలు, 93 అర్ధసెంచరీలు చేసిన సంగక్కర 13,739 పరుగులు చేశాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అదే విధంగా 130 టెస్టులాడి 12,203 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 319గా సంగక్కర నమోదు చేశాడు

ఈ 400 క్లబ్ లో చేరిన నాల్గవ ఆటగాడిగా ఆయన తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్లబ్ లో చేరిన వారిలో ముందు వరుసలో నిలిచింది భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆయన 463 మ్యాచ్ లు ఆడి 18 వేల 426 పరుగులు చేశాడు. తన సుదీర్ఘ పయనంలో 49 సెంచరీలను నమోదు చేసిన సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోరును 200 గా దక్షిణాప్రికాపై నమోదు చేశారు. కాగా ఈ క్లబ్ లో చేరిన మిగిలిన ముగ్గురు ఆటగాళ్లు లంకేయులు కావడం గమనార్హం. జయసూర్య అత్యధికంగా 445 మ్యాచ్ లు ఆడి 13, 430 పరుగులను సాధించి 28 సెంచరీలను సాధించగా. అత్యధిక వ్యక్తిగత స్కోరును 189గా నమోదు చేశాడు.

ఆ తరువాత జయవర్దనే 444 మ్యాచ్ లతో నాలుగువందల క్లబ్ లో నిలిచి 12 వేల 625 పరుగులు సాధించాడు. 144 అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన జయవర్దనే 19 సెంచరీలను కూడా నమోదు చేశాడు. సంగక్కర ఇవాళ్టి మ్యాచ్ తో 400 క్లబ్ లో చేరగా, ఇప్పటి వరకు ఆయన 13 వేల 739 పరుగులు సాధించాడు. ఈ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఆయన 21 సెంచరీలతను సాధించగా, తన వ్యక్తిగత స్కోరుగా 169 పరుగులను సాధించాడు. ఇక అటు టెస్టు మ్యాచ్ లలో నూ సంగక్కరా బంగ్లాదేశ్ జట్టుపైనే తన ప్రతాపం చూపి 400 పరుగులు చేసి 400 క్లబ్ లో చేరిన క్రికెటర్ గా కూడా రికార్డు సాధించిన విషయం తెలిసిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sangakarra  400 odi club  Srilanka  

Other Articles