Pietersen england career ends

Pietersen career ends, cricket, ecb, ashes,andy,flower,kevin pietersen,,kp, T20 World Cup, West Indies tour

Kevin Pietersen England career is over after he was told he is no longer part of the national team plans.

పీటర్సన్ ని సాగనంపారు

Posted: 02/06/2014 11:16 AM IST
Pietersen england career ends

ఇంగ్లాండ్ క్రికెట్ స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్ జీవితం ముగింసింది ? అతని పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెలక్షన్ లిస్టు నుండి ప్రక్కన పెడుతూ... రానున్న టి 20 ప్రపంచకప్, త్వరలో విస్టిండీస్ తో జరిగే సిరీస్ నుండి అతడ్ని దూరంగా పెట్టింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, ఇటీవల యాషెష్ సిరీస్ ఓడిపోవడం తో వచ్చే సంవత్సరం జరిగే ప్రపంచకప్ కి ఇప్పటి నుండే జట్టు ప్రక్షాళన పేరుతో ఆ జట్టు కోచ్ తో పాటు, ఆటగాళ్ళను కూడా జల్లెడ పట్టడంలో భాగంగానే పీటర్సన్ ని  తప్పించినట్లు చెబుతున్న ఈసీబీ ... అతన్ని తప్పించడానికి మాత్రం అతని వివాదాలే కారణం అని తెలుస్తుంది. దక్షిణాఫ్రికా జాతీయుడికి చెందిన పీటర్సన్  కెరియర్ దాదాపుగా వివాదాలతోనే సాగింది.

ఇంగ్లాండ్ జట్టుకి కెప్టెన్ గా ఉన్నప్పుడు కోచ్ పీటర్ మోరెన్ తో విభేదాలు, 2010లో నోరుకు పని చెప్పి పాకిస్థాన్ సిరీస్ కి, 2012 దక్షిణాప్రికా ఆటగాళ్ళకు ఇంగ్లాండ్ ఆటగాళ్ళను కించపరుస్తూ సందేశాలు పంపడం, ఐపీఎల్ లో ఆడే విషయం పై బోర్డుతో ఘర్షణ వంటివి పీటర్సన్ కెరియర్ లో పెద్ద వివాదాలకు కారణం అయ్యాయి. ఇంగ్లాండ్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతూ ఇక ఇంగ్లాండ్ జట్టుకు ఆడనని స్పష్టం చేశారు.

ఇన్ని రోజులు ఇంగ్లాండ్ దేశానికి ఆడటం నాకు గౌరవం.. నా కెరియర్ ఇలా ముగియడం విచారణ కరం. జట్టు సాధించిన విజయాలలో నేను భాగస్వామిని  అయినందుకు సంతోషిస్తున్నానని తెలిపాడు. తొమ్మిదేళ్ళ అంతర్జాతీయ కెరీర్ లో పీటర్సన్ 104 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 8181 పరుగులు, వన్డేల్లో 4440 పరుగులు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles