పురుషుల టెన్నిస్‌లో రాబోయే కాలం తనదేనని సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ మరో అద్వితీయ విజయంతో చాటుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌తో ఆదివారం జరిగిన 100వ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో జొకోవిచ్ 5-7, 6-4, 6-2, 6-7 (5/7), 7-5తో విజయం సాధించాడు. ఈ క్రమంలో వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. అంతేకాకుండా ‘గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల హ్యాట్రిక్’ను పూర్తి చేసుకున్నాడు. గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్కిది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 12 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్. రన్నరప్‌గా నిలిచిన నాదల్కు 11లక్షల 50వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 6 కోట్లు) దక్కాయి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more