Neeraj Chopra decides to end 2021 season స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సంచలన నిర్ణయం

Neeraj chopra decides to end 2021 season says focus shifted to packed 2022

Neeraj Chopra, javelin throw, Arshad Nadeem, Olympic Gold medalist, Tokyo Olympics 2020, sports, tokyo olympics india medals, viral news, Tokyo 2020 Olympic Games, Olympic Stadium, Tokyo Olympics

Olympic Gold medalist javelin thrower Neeraj Chopra has decided to end his 2021 competition season due to a "packed schedule of travel and a bout of illness" and vowed to comeback stronger in a busy 2022. "The packed schedule of travel and a bout of illness has meant I have not been able to resume training since Tokyo...," Neeraj wrote on an Instagram post.

ఒలంపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా సంచలన నిర్ణయం

Posted: 08/27/2021 08:09 PM IST
Neeraj chopra decides to end 2021 season says focus shifted to packed 2022

టోక్యో ఒలింపిక్స్‌లో స‌త్తా చాటి బంగారు పతకంతో అంద‌రి దృష్టినీ త‌న వైపున‌కు తిప్పుకున్న‌ భార‌త జావెలిన్ త్రో చాంఫియన్ గా అవతరించిన నీరజ్ చోప్రా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రేక్ తీసుకుంటానని ఈ ఏడాది ఇక ఆడనంటూ చెప్పేశాడు. అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మనోగతాన్ని వ్యక్తపరిచాడు. ‘టోక్యో నుంచి తిరిగొచ్చిన ముందుగా మీరు చూపిస్తున్న ప్రేమ, ఎఫెక్షన్‌కు థ్యాంక్స్. దేశవ్యాప్తంగా మీరు చూపించిన సపోర్ట్‌కు పొంగిపోయా. మీరు చూపించిన ఔన్నత్యాన్ని వ్యక్తపరచడానికి నా దగ్గర మాటల్లేవు’

‘టోక్యో నుంచి వచ్చాక షెడ్యూల్ కు అనుగుణంగా ప్రయాణించడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకే 2021 కాంపిటీషన్ సీజన్ ను ఇక్కడితో ఆపేసి కాస్త సమయం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. 2022 నాటికి రీఛార్జ్ అయి మునుపటి కంటే సమర్థవంతంగా తిరిగి రావాలని అనుకుంటున్నా. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్’. ‘కొద్ది వారాలుగా అందరి నుంచి ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. అలాగే ఇండియన్ అథ్లెట్లు అందరినీ కొన్ని నెలలు, సంవత్సరాల పాటు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నా. జై హింద్’ అని ముగించాడు.

 
 
 
View this post on Instagram

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles