Saina and Kashyap Wish Each Other నెహ్వాల్ కు విభిన్నంగా కశ్యప్ పెళ్లిరోజు శుభాకాంక్షలు

Saina nehwal and parupalli kashyap wish each other

anniversary, badminton, India, indian badminton, marriage, Marriage Anniversary, Parupalli Kashyap, saina nehwal

Saina Nehwal and Parupalli Kashyap are celebrating her first marriage anniversary. Saina and Kashyap had met at Pullela Gopichand's academy and were in a relationship for over a decade.

నెహ్వాల్ కు విభిన్నంగా కశ్యప్ పెళ్లిరోజు శుభాకాంక్షలు

Posted: 12/18/2019 08:08 PM IST
Saina nehwal and parupalli kashyap wish each other

మంచి భాగస్వామి రావాలని ఎప్పుడూ కోరుకోలేదని, కానీ అద్భుతమైన భార్య తనకి దొరికిందని భారత షట్లర్‌ పరుపల్లి కశ్యప్‌ అన్నాడు. భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు వారి పెళ్లిరోజు కావడంతో అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో సైనాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రపంచంలోనే అద్భుతమైన మహిళవి నువ్వు. నేను మంచి భార్య కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఈ తొలి ఏడాది ఎన్నో మధురానుభూతులు అందించిన్నందుకు థ్యాంక్స్‌. ఐ లవ్‌ యూ. హ్యాపీ యానివర్సరీ’’ అని కశ్యప్‌ పోస్ట్ చేశాడు.

పెళ్లి రోజు సందర్భంగా సైనా నెహ్వాల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారి ఫొటోను పోస్ట్ చేసింది. కశ్యప్‌ను సైనా తొలిసారిగా బ్యాడ్మింటన్‌ శిక్షణ తరగతిలో కలుసుకుంది. కొద్దికాలంలోనే వారి స్నేహం ప్రేమగా చిగురించింది. గత ఏడాది డిసెంబర్‌ 18న పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం నిరాడంబరంగా జరిగింది. రిజిస్టర్‌ మ్యారేజ్‌ ద్వారా వీరిద్దరు ఒకటయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles