Amit Panghal bags gold in men's boxing బాక్సింగ్ లో భారత బాక్సర్ అమిత్ కు స్వర్ణం

Asian games 2018 amit panghal bags gold in men s boxing

Men’s boxing, Amit Panghal, Gold medal, Light Fly (49kg) category, asian games medal tally, asian games 2018 medal tally, asian games 2018, 2018 asian games, india asian games medals, asian games leaderboard, sports news, sports, latest sports news

Defeating Uzbek Olympic champion Hasanboy Dusmatov, Amit Panghal clinched India's first boxing gold in the Asian Games 2018 on Saturday. He also became the eighth Indian boxer ever to claim a gold medal at the Asian Games.

బాక్సింగ్ లో భారత్ వశమైన పసిడి.. అమిత్ అద్భుత ప్రదర్శన

Posted: 09/01/2018 04:40 PM IST
Asian games 2018 amit panghal bags gold in men s boxing

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పురుషుల బాక్సింగ్‌ 49 కేజీల లైట్ ఫ్లై విభాగం ఫైనల్‌లో భారత్‌కు చెందిన అమిత్‌ పంఘాల్‌ విజేతగా నిలిచి స్వర్ణం పతకం సాధించాడు. ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన హసన్‌బోయ్‌ దుస్మతోమ్‌పై విజయం సాధించాడు. ఈ ఏషియాడ్‌లో ఫైనల్‌ చేరిన ఏకైక భారత బాక్సర్‌ అమితే.

2016 రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత దుస్మతోమ్‌పై విజయం సాధించడంతో అమిత్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హరియాణాకు చెందిన అమిత్‌ ఈ ఏడాది గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించాడు. ఆ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 14వ స్వర్ణం. ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో 66 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 14 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్యాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 2010లో 65 పతకాలు(14 స్వర్ణాలు, 17 రజతాలు, 34 కాంస్యాలు) దక్కించుకుంది. తాజా ఆసియా క్రీడల్లో భారత్‌ గత రికార్డును బద్దులుకొట్టి 66 పతకాలతో ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Men’s boxing  Amit Panghal  Gold medal  asian games 2018  india  leaderboard  sports news  sports  

Other Articles