Lakshya Sen claims Asian Junior title స్వర్ణం సాధించిన లక్ష్యసేన్.. జూనియర్ ఛాంప్

Lakshya clinches asia junior championship title

Lakshya Sen, Sayali Gokhale, Sindhu, Asia, Lin Dan, Vimal Kumar, Indonesia, New Zealand, New Zealand Open, Ikhsan Leonardo Imanuel Rumbay, kunlavut vitidsarn, Pranav Chopra, Sameer Verma, Thomas Cup, Badminton Asia Junior Championships, Li Shifeng, Ikhsan Leonardo Imanuel Rumbay, Prakash Padukone Badminton Academy, Badminton, sports world, sports news,sports, latest sports news, cricket

Sixteen-year-old Lakshya Sen went to Jakarta for the Badminton Asia Junior Championships with a considerable burden of expectations.

ఆసియా ఛాంపియన్ టైటిల్ మనదే.. లక్ష్యసేన్‌ సంచలనం..

Posted: 07/23/2018 02:09 PM IST
Lakshya clinches asia junior championship title

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు‌. అద్భుత ఆటతో ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరోసీడ్‌ సేన్‌ 21-19, 21-18తో టాప్‌సీడ్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కులావత్‌ వితిసన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు. తొలి గేమ్‌ ఆరంభంలో వితిసన్‌ ఎదురుదాడి చేస్తూ పాయింట్లు సాధించగా.. లక్ష్య వెంటనే పుంజుకున్నాడు. ఒక దశలో గేమ్‌ 7-7తో సమానంగా సాగింది.

అయితే ముచ్చటైన డ్రాప్‌ షాట్లు, మెరుపు స్మాష్‌లతో విజృంభించిన సేన్‌ 13-11తో ఆధిక్యంలో నిలిచాడు. కానీ ప్రత్యర్థి కూడా పుంజుకోవడంతో స్కోరు 19-19గా నిలిచింది. ఈ స్థితిలో కళ్లుచెదిరే డ్రాప్‌ షాట్‌తో పాయింట్‌ గెలిచిన లక్ష్య.. ఆ వెంటనే మరో పాయింట్‌ సాధించి తొలి గేమ్‌ గెలుచుకున్నాడు. రెండో గేమ్‌ కూడా నువ్వానేనా అన్నట్లు  సాగింది. విరామ సమయానికి 10-11తో ఒక పాయింట్‌ వెనకబడ్డ సేన్‌.. ఆ తర్వాత పుంజుకుని 17-17తో స్కోరు సమం చేశాడు.

అంతేకాక కీలక సమయంలో పాయింట్‌ గెలిచి 18-17తో ఆధిక్యంలోకి వెళ్లిన అతను ఆపై వరుస పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భారత షట్లర్‌ ప్రయాణమే సంచలనం! టైటిల్‌ గెలిచే క్రమంలో అతను టాప్‌సీడ్‌తో పాటు రెండో సీడ్‌ లి షిఫెంగ్‌ (చైనా), నాలుగో సీడ్‌ లియానార్డొ (ఇండోనేషియా)లకు షాకిచ్చాడు. ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్‌కు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) రూ.10 లక్షల నజరానా ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshya Sen  Kunlavut Vitidsarn  Asia Junior Championship  Uttarakhand  Badminton  Indian  sports  

Other Articles