Sania closing in on World No 1 ranking ! Family Circle Cup ! Tennis Ranking

Sania mirza inches closer to world number one rank

Sania Mirza, Martina Hingis, Miami Open women’s doubles final, Ekaterina Makarova, Elena Vesnina, BNP Paribas Open, Andrea Hlavackova, Lucie Hradecka, Sania need 145 points world number one, sania world No.1 player in doubles,. Family Circle Cup, Tennis Ranking

Sania Mirza took a giant leap towards becoming world number one player in the doubles by pocketing 1000 ranking points, following her stupendous title win in the Miami Open with doubles partner Martina Hingis

ప్రపంచ నెం 1 స్థానానికి చేరువలో సానియా

Posted: 04/06/2015 01:33 PM IST
Sania mirza inches closer to world number one rank

భారత టెన్నీస్ దిగ్గజం సానియా మిర్జా.. మర అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో వుంది. భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ టెన్నీస్ లో ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి అడుగు దూరంలో నిలించింది. స్విట్జర్లాండ్ కు చెందిన మార్టినా హింగిస్ తో కలసి మియామీ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సానియా మిర్జా తన ఖాతాలో 100ే పాయింట్లను నమోదు చేసుకుంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు ఆమె ఖాతాలో 7495 పాయింట్లు చేరాయి. వీటితో అమె ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడో ర్యాంకులో కోనసాగుతున్నారు.

మరో 145 పాయింట్లు చేరితే సానియా మిర్జా ప్రపంచ టెన్నీస్ ర్యాంకింగ్ లో టాప్ వన్ గా నిలవనుంది. నంబర్ వన్ ర్యాంకులో కొనసాతున్న ఇటలీ క్రీడాకారిణులు సారా ఎరాలీ,  రాబర్టా విన్సీ ఖాతాలో మొత్తం 7640 పాయింట్లు ఉన్నాయి. చార్లెస్టన్ లో ఈవారం ప్రారంభంకానున్న ఫ్యామిలీ సర్కిల్ కప్ లో సానియా విజయం సాధిస్తే ఆమె అగ్రస్థానానికి చేరుతుంది. ఎలెనా వెస్నినాతో కలిసి 2011లో ఫ్యామిలీ సర్కిల్ కప్ టైటిల్ ను సానియా మీర్జా కైవసం చేసుకుంది. దీంతో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థుతుల్లో జార విడుచుకోవద్దని భారత టెన్నిస్ అభిమానులు కోరుతున్నారు. ఇటీవలే భారత ఏస్ షెట్లర్ సైనా నెహ్వాల్ కూడా ప్రపంచ టాప్ ర్యాంకర్ గా నిలిచిన విషయం పాఠకులకు విధితమే

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Martina Hingis Miami Open  Family Circle Cup  Tennis Ranking  

Other Articles