Goa extends support to 'Maa robot' that feeds differently-abled girl తనయ కోసం తండ్రి ప్రయోగం: అన్నం తినిపించే రోబో.!

Goa daily wage worker builds maa robot to feed his differently abled daughter

Differently-abled child, Maa Robot, bipin kadam, bethora village, ponda taluka, south goa, robot, feeding robot, daughter, Goa State Innovation Council, financial support, commercial use, design, Online knowledge, viral news

Goa has extended support to the ‘Maa robot’, which was built by daily-wage worker Bipin Kadam to feed his differently-abled daughter. The Goa Innovation Council will provide financial assistance for further developing the robot and exploring its commercial viability.

దివ్యాంగురాలైన తనయ కోసం తండ్రి ప్రయోగం: అన్నం తినిపించే రోబో.!

Posted: 09/26/2022 01:49 PM IST
Goa daily wage worker builds maa robot to feed his differently abled daughter

ఆయన ఓ దినసరి కూలి. చదివుకున్నది కూడా పెద్దగా లేదు. అయితే పెద్దలు చెప్పినట్టు అవసరాన్ని మించిన అలోచన లేదు. ఆలోచనతో పుట్టని ఆవిష్కరణ లేదు. ఇదే ఇప్పుడీ సాధారణ కూలీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. రెక్కాడితే కానీ డిక్కాడని పేద కూలీ అయిన బిపిన్ కదమ్.. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పుట్టిపెరిగాడు. దినసరి కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే తాటికాయపై రోకటిపోటు అన్నట్లు ఆయన పేదరికానికి తోడు ఆయనకు దివ్యాంగురాలైన కూతురు పుట్టింది. అయినా సాధారణ పిల్లల మాదిరిగా అమెను పెంచేందుకు బిపిన్ కష్టపడుతూనే ఉన్నాడు.

అయితే ఎవరో ఒకరి సాయం లేకుండా కదలడం కానీ, తినడం కానీ.. తాగడం కానీ చేయలేని పరిస్థితి అతని కూతురుది. దీంతో అమె సపర్యలన్నీ బిపిన్ భార్య చూసుకునేది. అయితే గత కొంతకాలం క్రితం అమె కూడా మంచాన పడింది. దీంతో తమ బిడ్డ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వీరిద్దరినీ చూసుకునే బాధ్యత తనపై పడింది. కాగా, తాను పనికి వెళ్లకపోతే వారికి బోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. దీంతో తాను పనికి వెళ్లి ఇంట్లో బిడ్డకు తినిపించేందుకు ఓ మనిషిని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అందుకు అతని భార్య సమస్మతించలేదు. తన కూతురు బాధ్యతను వేరేవాళ్లకు అప్పగించరాదని అమె కోరింది.

ఒక్క రోజు, రెండు రోజులు బాగానే చూసుకుని తినిపించినా.. ఆ తరువాత వారు విసుగుకోవడం చేస్తారని చెప్పింది. దీంతో అదీ నిజమేనని బావించిన అమె భర్త.. తన బిడ్డకు అన్నం తినిపించేందుకు ఓ రోబోనే తయారు చేయాలని పూనుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన కూలీ పని చేస్తూనే.. ఆ తరువాత ఇలాంటి రోబోలు ఎక్కడైనా లభిస్తాయా అని వెతికాడు. అయితే రోబోలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా అన్నం తినిపించే రోబోలు మాత్రం లేవని తెలుసుకున్నాడు. ఇక ఇలాంటి ఓ రోబోను తానే తయారు చేయాలని భావించా డు. అందుకోసం రోబోను తయారు చేయడం ఎలా అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు.

తన బిడ్డకు ఆన్నం తినిపించే రోబోను తయారు చేశాడు. దానికి అమ్మ రోబో అంటూ నామకరణం చేశాడు. తన బిడ్డకు ఈ రోబోనే కొంతకాలంగా అన్నం తినిపిస్తోంది. ఇది క్రమంగా బయటి వ్యక్తులకు తెలియడంతో అలా క్రమక్రమంగా వైరల్ న్యూస్ గా మారింది. గోవాలోని దక్షణి ప్రాంతంలోని పాండా తాలుకాలో బెహరా గ్రామానికి చెందని బిపిన్ కదమ్ ఈ అమ్మరోబోతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పోందుతున్నాడు. ఎటువంటి సాఫ్ట్ వేర్ అవగాహలేని ఓ సాధారణ కూలి రోబోటిక్ ఇంజనీర్లు తయారుచేయగలిగే రోబోను తయారు చేయడం అంటే మాటలు కానేకాదు. అందుకే బిపిన్ టెక్ దిగ్గజాలకే ఆదర్శంగా నిలిచాడు.

బిపిన్ నాలుగు నెలల్లోనే పరిశోధనకు ప్రతిఫలంగా అతని కష్టం తీరింది. బిడ్డకు అన్నం తినిపించటానికి ఓ రోబో రూపొందింది. పెద్దగా చదువుకోని బిపిన్ కూలికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొచ్చాక రోబోను తయారుచేయడం ఎలా అన్నదానిపై నాలుగు నెలలపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకుని..దానిపై అవగాహన పెంచుకున్నాడు. అలా నాలుగు నెలలు కష్టపడి ఓ రోబోను తయారుచేశాడు. పూర్తిగా వాయిస్ కమాండ్‌తో పనిచేస్తున్న ఈ రోబో తన బిడ్డకు ఆకలేసిన ప్రతీసారి బోజనాన్ని పెడుతోంది. దాని చేతిలో ఆహారం ఉన్న పళ్లెం పెడితే అది కలిపి కుమార్తెకు తినిపించేలా డిజైన్ చేశాడు బిపిన్.

తన బిడ్డకు కూర నచ్చకపోవడం వల్ల అన్నం తినకపోతే ఎలా.. అని దానికి కూడా పరిష్కారం కనుక్కున్నాడు బిపిన్. వాయిస్ కమాండ్ ద్వారా ఆహారాన్ని ఏ కూరతో కలిపి తినిపించాలో చెబితే రోబో అదే చేసేలా డిజైన్ చేశాడు. అచ్చం అమ్మలాగా. అందుకే మామ్ రోబో అని పేరు పెట్టాడీ క్రియేటర్. ఈ రోబో విజయవంతంగా పనిచేస్తుండడంతో బిపిన్‌ ఆనందానికి హద్దే లేకుండాపోయింది. తన బిడ్డలాంటి పరిస్థితి ఉన్నవారు ఎవరైనా కోరితే ఇటువంటి రోబోలు తయారు చేస్తానంటున్నాడు. ఇక బిపిన్ ఘనత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బిపిన్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన తయారు చేసిన ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles