Woman Gets Husband Married to His Lover భర్తకు ప్రియురాలితో దగ్గరుండి పెళ్లి చేయించిన భార్య..

Woman gets husband married to his lover a year after own wedding

Wife, Husband, lover, second marriage, girl friend, Ambedkar nagar, Visakhapatnam tic-toker, Temple city, Tirupati, Tik-Toker, Kadapa Tik-toker girl, social media, Andhra Pradesh, Crime

A woman in Andhra Pradesh’s Temple City Tirupati, who got married an Year ago, helped his husband to reunite with his girlfriend. However, the only deviation from the movie plot was that the man has no choice except to go with the wife and lover.

భర్తకు ప్రియురాలితో దగ్గరుండి పెళ్లి చేయించిన భార్య.. ట్విస్టు ఇదే..

Posted: 09/22/2022 05:09 PM IST
Woman gets husband married to his lover a year after own wedding

మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి.. నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా  వెళ్లి.. మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మల్లి చిగురించాలి.. అప్పగిస్తున్నాను నిన్నే  నమ్మి నిత్యం కొలిసే నా రాముణ్ణి.. బంగారు సీతమ్మవై పూజించుకుంటానని.. కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని.. ఈ పాట ఏ చిత్రంలోనిదో తెలుసా.? మావిచిగురు సినిమా.. జగపతిబాబు అమనీ, రంజిత కలసి నటించిన చిత్రమిది. ఈ చిత్రంలోని ఈ పాటను అక్షర మాంత్రికుడు సిరివెన్నల సీతారామశాస్త్రి రచించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమని చేసిన అభినయం సూపర్.

అయితే తాను ఆమనిలా మంచి భార్యను అనిపించుకోవాలని అనుకుందో.. లేక టిక్ టాక్ స్టార్ గా హిట్ అయ్యిన సక్సెస్ మంత్రాను పట్టుకోవాలని అనుకుందో తెలియదు కానీ.. ఈ చిత్రం తరహాలోనే ఆమని పాత్రను పోషించింది ఓ భార్య. తన భర్తకు తన అఫీసులోని మరో యువతితో అక్రమ సంబంధం అంటగట్టి వారిద్దరికీ పెళ్లి చేయించిందీ భార్య పాత్రను పోషించిన ఆమని మాదిరిగానే ఇక్కడ కూడా తన భర్తకు తన ప్రియురాలితో పెళ్లి చేసింది ఓ టిక్ టాక్ స్టార్. అయితే ఆ సినిమాలో అమనికి క్యాన్సర్ అని తేలడంతో ఇలా చేసింది. కానీ ఇక్కడ మాత్రం తన భర్త మాజీ ప్రియురాలని తెలసి వారికి పెళ్లి చేసింది ఈ భార్య.

ఇక్కడే అసలు ట్విస్టు.. ఇకపై ముగ్గురు కలసి కాపురం చేస్తారు. అందుకు అంగీకరించే ఈ పెళ్లి చేయడం గమనించాల్సిన విషయం. వివరాల్లోకి వెళ్తే... తిరుపతిలోని అంబేద్కర్ నగర్ లో ఉంటున్న ఒక యువకుడు టిక్ టాక్ లో రాణిస్తున్న సమయంలో విశాఖకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ చనువుగా ఉన్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత టిక్ టాక్ లోనే కడపకు చెందిన మరో అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత విశాఖకు చెందిన అమ్మాయి మళ్లీ తిరిగొచ్చింది. ప్రియుడికి పెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఆమె బాధపడింది. ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాత తాను కూడా ఇక్కడే ఉండిపోతానని, ముగ్గురం కలిసి ఉందామని ప్రియుడి భార్యతో చెప్పింది. ఈ మాట విన్న భార్య ముందు షాక్ తిన్నా.. తర్వాత ముగ్గురూ కలిసి ఉండేందుకు ఒప్పుకుంది. నిన్న దగ్గరుండి తానే తన భర్తకు, ఆయన ప్రియురాలికి పెళ్లి జరిపించింది. పెళ్లి కూతురుని కూడా ఆమె స్వయంగా అలంకరించింది. ఈ విషయం తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wife  Husband  lover  second marriage  girl friend  Temple city  Tirupati  Tik-Toker  social media  Andhra Pradesh  Crime  

Other Articles