Rs 200 crore extortion case: Cops grills Nora Fatehi న‌టి నోరా ఫ‌తేహ్‌ను నాలుగు గంటలు విచారించిన పోలీసులు

Actor nora fatehi questioned in rs 200 crore extortion case against conman

money laundering case, Rs 200 crore money laundering case, Rs 200 crore extortion case, conman sukesh chandrashekhar, sukesh chandrashekhar wife, conman, Nora, Nora Fatehi questioned Sukesh Chandrashekhar, Nora Fatehi Sukesh Chandrashekhar, sukesh chandrashekhar, Bollywood actress, nora fatehi, jacqueline fernandez, Bollywood, Crime

The Rs 200 crore money laundering case involving alleged conman Sukesh Chandrashekhar has been making the headlines lately. Bollywood actresses Jacqueline Fernandez and Nora Fatehi’s name also popped up during the investigation of the case and since then, both the actresses have been called for questioning by the police a couple of times.

న‌టి నోరా ఫ‌తేహ్‌ను నాలుగు గంటలు విచారించిన పోలీసులు

Posted: 09/03/2022 12:34 PM IST
Actor nora fatehi questioned in rs 200 crore extortion case against conman

బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహ్‌ను ఢిల్లీ పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. సుమారు 200 కోట్ల బెదిరింపుకేసులో అమె పాత్ర ఏమైనా ఉందా.? అన్న వివరాలను అమె నుంచే రాబట్టే ప్రయత్నం చేశారు. రూ.200 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడిన కేసులో నోరా ఫతేహ్ పాత్ర ఏమిటన్న వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా, ఈ కేసుతో లింకున్న కాన్‌మాన్ సురేశ్ చంద్ర‌శేఖ‌ర్ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల శాఖ నోరా ఫ‌తేహ్‌ను ఓ కేసులో సాక్షిగా విచారించారు.

ఇదే కేసులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను పోలీసులు గ‌తంలో విచారించారు. అయితే నోరా ఫ‌తేహ్‌తో పాటు ఇత‌ర సెల‌బ్రిటీలు సుకేశ్ నుంచి ఖ‌రీదైన గిఫ్ట్‌లు తీసుకున్న‌ట్లు ఫెర్నాండేజ్ ఆరోపించింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో సుకేశ్‌, నోరా ఫ‌తేహ్‌ను గ‌తంలో ఈడీ ప్ర‌శ్నించింది. నోరా ఫ‌తేహ్‌కు బీఎండ‌బ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు సుకేశ్ గ‌తంలో తెలిపాడు. దీనిపై ఫ‌తేహ్ స్పందిస్తూ ఆ కారును త‌న ఫ్రెండ్ బాబీ ఖాన్‌కు ఇచ్చిన‌ట్లు చెప్పుకువ‌చ్చింది. ర్యాన్‌బాక్సీ కంపెనీ ప్ర‌మోట‌ర్ల‌ నుంచి 215 కోట్ల‌ను బెదిరించి వ‌సూల్ చేసిన‌ట్లు సుకేశ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles