India starts vaccinatingchildren in 12-14 age group నేటి నుంచే 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కోవిడ్ వాక్సీన్

Around 17 3 lakh children in 12 14 age group eligible for covid 19 vaccination

corbevax vaccine, corbevax biological e, corbevax, corbevax india, corbevax price, corbevax who approval, corbevax efficacy, corbevax news, corbevax vaccine efficacy, biological e corbevax, vaccination of 12-15 year olds in india, vaccination age chart, vaccination news india, 12-14 vaccine, 12-14 covid vaccine, covid vaccine for 12-14 year olds, 12-14 year old vaccine, india coronavirus, coronavirus drive in india, covid cases in india

The Centre released a list of guidelines for vaccine drive and said that the beneficiaries in this phase would receive Biological E's intramuscular vaccine Corbevax. Corbevax is being called “India’s first indigenously developed protein subunit vaccine against COVID-19”. Corbevax is developed by the Hyderabad-based Biological E Ltd in collaboration with the Texas Children’s Hospital Centre for Vaccine Development and Baylor College of Medicine in Houston, Texas.

నేటి నుంచే 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కోబ్రివాక్స్ కరోనా వాక్సీన్

Posted: 03/16/2022 11:41 AM IST
Around 17 3 lakh children in 12 14 age group eligible for covid 19 vaccination

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ మరో మైళురాయిని అందుకున్నది. ఇదివరకే పదిహేనేళ్లపైన వయస్సు కలిగిన వారికి వాక్సీనేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, మరోవైపు 60 ఏళ్లపైన వున్నవారికి ప్రికాషనరీ డోస్ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో రేపటి పౌరులైన 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు కూడా ఇవాళ్టి నుంచి వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌కు చెందిన ‘బయాలాజికల్‌-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్‌ టీకాను పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.

2010 లేదా అంతకన్నా ముందు జన్మించి 12 ఏండ్లు పూర్తిచేసుకున్నవాళ్లు టీకా తీసుకోవడానికి అర్హులని, వీరంతా వ్యాక్సిన్‌ కోసం కొవిన్‌ పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఒకవేళ 12 ఏండ్లు నిండకపోతే పేరు నమోదు చేసుకున్నా టీకా ఇచ్చేదిలేదని స్పష్టం చేసింది. కొవిన్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొని ఇప్పటికే టీకా తీసుకున్న తల్లిదండ్రుల అకౌంట్‌ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్‌ (స్లాట్‌) ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు. అలాగే టీకా కేంద్రానికి వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏండ్ల వయస్సు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం పట్ల చిన్నారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దాదాపుగా అందరూ చిన్నారులు సంతోషం వ్యక్తంచేస్తుండగా, కొందరు మాత్రం ఇంజక్షన్ అనగానే ఏడపు ముఖాలు పెట్టేస్తున్నారు. కాగా, ఇప్పటికే తమ తల్లిదండ్రులు, వయస్సులో పెద్దవారైన అక్క, అన్నలతో పాటు తాతా, నాయినమ్మలు టీకాలు తీసుకుని.. కరోనా నుంచి రక్షణ పోందుతూ సురక్షితంగా వున్నారని.. అలానే తాము కూడా వాక్సీన్ మంచే చేస్తోందని అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమలాగే తమ వయస్సులోని వారందరూ కార్బోవ్యాక్స్‌ వాక్సీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల వయస్కులు దాదాపు 17.23 లక్షల మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. వీరందరికీ ఇవాళ్టి నుంచి టీకా పంపిణీ చేసేందుకు సర్కార్​ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ​టీకా కేంద్రాల్లోనూ పంపిణీ చేయనున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు ఈ వ్యాక్సిన్‌ను ధైర్యంగా తీసుకోవచ్చని డీహెచ్​ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్ కంటే కొర్బెవ్యాక్స్‌తో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎక్స్​పర్ట్స్​ దీన్ని రిఫర్​ చేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు బూస్టర్ డోసు లేదా ప్రికాషనరీ డోసుకు ఇక నుంచి 60 ఏళ్లు దాటినోళ్లంతా అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles