New antibody helps block Covid transmission in cells: Study కణాల్లోకి చేరకుండా కరోనాను కట్టడి చేసే కొత్త యాంటీబాడీ

New antibody that can block covid transmission in cells finds study

Covid antibody, Covid transmission, coronavirus infection, covid-19 pandemic, SARS-CoV-2, therapeutic monoclonal (IgG) antibodies, SARS-CoV-2 spike protein, antibody, furin, transmission chain of SARS-CoV-2, SARS-CoV-2, SARS-CoV-2 virus, SARS-CoV-2 covid virus, SARS-CoV-2 virus antibodies, SARS-CoV-2 covid virus antibodies

Researchers have engineered a novel antibody that can directly interfere with and block the cell-to-cell transmission ability of SARS-CoV-2, the virus that causes COVID-19. The antibody, FuG1, targets the enzyme furin, which the virus uses for its efficient chain of infections in human cells.

కణాల్లోకి చేరకుండా కరోనాను కట్టడి చేసే కొత్త యాంటీబాడీ అభివృద్దీ

Posted: 02/15/2022 11:31 AM IST
New antibody that can block covid transmission in cells finds study

కరోనా మహమ్మారిని నియంత్రించి మనషిపై ఎలాంటి ప్రభావం చూపకుండా చేసేందుకు గత రెండేళ్లుగా వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా కట్టడిపై విస్తృతస్థాయిలో రీసర్చ్ జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే తొలుత కరోనాకు మందును, ఆ తరువాత కరోనా దరిచేరకుండా వాక్సీన్ ను కూడా వైద్యనిపుణులు తీసుకువచ్చారు. ఇక తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. సరికొత్త యాంటీబాడీని అభివృద్ధి చేశారు. మానవ కణాల్లో ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించకుండా కరోనా వైరస్ ను ఇ విజయవంతంగా అడ్డుకుంటుంది. దీనికి ఫుజి1 (FuG1)గా నామకరణం చేశారు.

మానవ కణాల్లోకి చొరబడేందుకు కరోనా వైరస్ క్రిములు వినియోగించే ఫ్యురిన్ అనే ఎంజైమును ఈ కొత్త యాంటీబాడీ నాశనం చేస్తుంది. తద్వారా కరోనా వైరస్ గొలుసును తెంచేస్తుంది. ఫ్యురిన్ సాధారణంగా మానవ దేహంలో విరివిగా ఉంటుంది. ఇది ప్రొటీన్లను సైతం చిన్న ముక్కలుగా విడగొట్టగలిలే శక్తిని కలిగి ఉంటుంది. ప్రొటీన్లను ఆవరించి ఉండే పాలీబేసిక్ పెప్టైడ్ కవచాలను సైతం ఇది ఛేదిస్తుంది. అందువల్లే కరోనా క్రిములు ఈ ఫ్యురిన్ ఎంజైమును ఉపయోగించుకుని శరీరంలోని ప్రతి అవయవంలోనూ వరుసగా ఇన్ఫెక్షన్లను కలుగచేస్తాయి. అయితే కొత్త యాంటీబాడీ ద్వారా ఫ్యురిన్ ఎంజైము కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అచేతనావస్థకు తీసుకెళ్లవచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.

ఈ యాంటీబాడీ పనితీరును మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ కొత్త యాంటీబాడీ (FuG1)ని గనుక ఇప్పటికే కరోనా చికిత్సలో వినిగియోస్తున్న సార్స్ కోవ్-2 కరోనా కాక్ టెయిల్ ఔషధాలకు జోడిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జోగేందర్ తుషీర్ సింగ్ అనే పరిశోధకుడు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్లు ప్రజలను ఆసుపత్రి పాలవ్వకుండా కాపాడుతున్నాయని, అయితే, కరోనా వ్యాప్తిని సమర్థంగా అరికట్టడంలో వ్యాక్సిన్లు ఏమంత ప్రభావశీలత కనబర్చవని అభిప్రాయపడ్డారు. తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకారి అవుతుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles