Police thrash woman for not wearing mask in public మాస్క్ ధరించలేదని కూతురి ఎదుటే మహిళపై పోలీసులు జులుం

Viral video woman brutally kicked punched by cops for not wearing mask

Madhya Pradesh police trash woman for not wearing mask,COVID Guideline Violation,Madhya Pradesh, MP Police, police brutality, Sagar district, lockdown in Madhya Pradesh, section 144 in Madhya Pradesh, Madhya Pradesh lockdown guidelines today,Madhya Pradesh tightens lockdown guidelines, lockdown in Madhya Pradesh again, lockdown in Madhya Pradesh, lockdown guidelines Madhya Pradesh, lockdown travel guidelines, Madhya Pradesh lockdown full restrictions, covid-19 rules, coronavirus rules, covid guidelines, covid test, social distance, India, Covid-19 norms, masks, COVID-19 count, COVID deaths, COVID19 updates, Coronavirus death toll, Coronavirus news, Coronavirus treatment

A woman passerby was brutally kicked, punched and dragged on a road by a group of police personnel in Madhya Pradesh’s Sagar district for not wearing a mask amid COVID pandemic. The incident happened when the woman along with her daughter was going to the market to buy groceries amid Covid restrictions.

ITEMVIDEOS: మాస్క్ ధరించలేదని కూతురి ఎదుటే మహిళపై పోలీసులు జులుం

Posted: 05/20/2021 02:03 PM IST
Viral video woman brutally kicked punched by cops for not wearing mask

కరోనా వైరస్ మహమ్మారి రెండో దఫా విరుచుకుపడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా మళ్లీ కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అందరూ మాస్కులు ధరించాలని, ప్రతీ గంటకు చేతులు కడుక్కోవాలని, అత్యవసర పనులు నిర్వహించేవారు మినహా మిగతా వ్యక్తులు బయట తిరగవద్దని, ఇక వారు కూడా తప్పనిసరిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్న కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ.. టీకా వేయించుకున్నవారైనా సరే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ క్రమంలో మాస్క్ ధరించకుండా రోడ్లపై బాహాటంగా సంచరిస్తున్నవారిపై జరిమానాను విధించింది.

ఇక ఈ క్రమంలో విమానాశ్రయాల్లో ఎవరైనా మాస్క్ ధరించకుండా సంచరిస్తే వారిపై కఠిన చర్యలకు పూనకునేలా అదేశాలను జారీ చేసింది. ఈ అదేశాల నేపథ్యంలో మాస్క్ పెట్టుకోలేద‌న్న కార‌ణంతో కొందరు పోలీసులు సామాన్య ప్ర‌జ‌ల‌పై దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో ఓ మహిళపై కొందరు పోలీసులు జులుం ప్రదర్శించారు. అమె కూతురు ముందే చేయిచేసుకున్నారు. అంతటితో ఆగకుండా అమె జుట్టును పట్టుకుని న‌డిరోడ్డుపై కింద ప‌డేసి కోట్టారు. ఇంత దారుణంగా ప్రవర్తించారు ఇంతకీ వీరు పోలీసులేనా అన్న అనుమానం స్థానికులలో కలిగింది.

అసలేం జరిగింది.. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు కొనుక్కుని వెళ్ల‌డానికి బ‌య‌ట‌కు వెళ్లింది. ఆమె మాస్కు ధ‌రించ‌క‌పోవ‌డాన్ని చూసిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్ల‌డానికి వాహ‌నం ఎక్కాల‌ని చెప్పారు. ఆమె భయపడి ఎక్కక‌పోవ‌డంతో ఓ లేడీ పోలీసు దాడి చేసింది. త‌న త‌ల్లిని కొట్టొద్ద‌ని ఆమె కూతురు వేడుకుంటున్న‌ప్ప‌టికీ పోలీసులు ఆ యువ‌తిని ప‌క్క‌కు లాగి ప‌డేశారు. మాస్కు పెట్టుకోని మ‌హిళ‌ను వాహ‌నంలోకి ఎక్కాలంటూ న‌డిరోడ్డుపైనే కొట్టారు. ఆమె ఎంత‌కీ ఎక్క‌క‌పోవ‌డంతో ఆమె జుట్టుపట్టుకుని, రోడ్డుపై ప‌డేసి లేడీ పోలీసు కొట్టింది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను స్థానికులు తమ స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో తీసి దానిని సామాజిక మాధ్య‌మాల్లో అప్ లోడ్ చేయ‌డంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో ఈ వీడియోను చూస్తోన్న నెటిజన్లు.. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు ఎవగించుకుంటున్నారు. పోలీసులం అన్న అహంభావంతో ఎవరినైనా ఏమైనా చేయవచ్చునని వారు భావించడంతోనే ఇలాంటి ఘటనలు దేశంలో అక్కడక్కడా ఇంకా నమోదు అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మహిళపై ఇంత నీచంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles