Poor ventilation may increase coronavirus spread: Study వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే.. కరోనా ముప్పు పొంచి వున్నట్లే

Lack of ventilation ups risk of airborne transmission of covid 19 study

coronavirus, covid-19, adequate ventilation, light, reserchers, indian born scientist, airborne transmission, University of Surrey, UK

Researchers, including one of Indian-origin, have found that the lack of adequate ventilation in many indoor environments - from the workplace to the home - increases the risk of airborne transmission of Covid-19. In a study, experts from the University of Surrey (UK) said that preventing airborne transmission of Covid-19 should be the next front of the battle against the virus.

వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే.. కరోనా ముప్పు పొంచి వున్నట్లే

Posted: 05/30/2020 05:59 PM IST
Lack of ventilation ups risk of airborne transmission of covid 19 study

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక దేశాలు తమ తమ స్థాయిలో అధ్యయనాలు చేస్తున్నాయి. కరో్నా ఎలా వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించే వాక్సీన్ కోసం కూడా పరిశోధనలు సాగుతున్నాయి, ఈ నేపథ్యంలో యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన సర్రే విశ్వవిద్యాలయం చేసిన ఓ అద్యయనం కరోనా నివారణకు వెంటిలేషన్ సరిగ్గా వుండాల్సిన అవసరం వుందని వెల్లడైంది. కరోనాకు వ్యాప్తి నేపథ్యంలో దేశాలన్నీ లాక్ డౌన్ ఫ్రకటించి ప్రజల్ని ఇళ్లుకు మాత్రమే పరిమితం చేస్తున్న తరుణంలో.. తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రజలు వారి నివసిస్తున్న ఇళ్లు, పనిచేస్తున్న కార్యాలయాల్లో, వ్యాపార కేంద్రాలు, ఎక్కడైనా సరే.. సవ్యంగా గాలి ప్రసరణ జరగాలని.. వెలుతురు కూడా ఇంట్లోకి రావాలని అలా కాని పక్షంలో.. కరోనా వైరస్‌ను కొనితెచ్చుకున్నట్టేనని సర్రే యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ తెలిపారు. సక్రమంగా గాలి, వెలుతురు వచ్చి వెంటిలేషన్ కూడా సవ్యంగా వుంటే.. ఇంట్లోకి చేరిన కరోనా వైరస్ కూడా బయటకు వెళ్తుందని చెబుతున్నారు. అలా కాకుండా వెంటిలేషన్ ను మూసివేసినా.. లేక సరైన వెంటిలేషన్ లేకపోయినా కరోనా ఇళ్లు, కార్యాలయాల్లో తిష్టవేసే ముప్పు పోంచివుందని అంటున్నారు.

తుమ్ము, దగ్గు, నిశ్వాసల ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, కానీ వైరస్ కణాలు మాత్రం అక్కడే ఉండిపోతాయని తమ అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు. దీంతో వెంటిలేషన్ సక్రమంగా వుంటే వైరస్ బయటకు వెళ్తుందని తెలిపారు. గదులు, కార్యాలయాల్లో ఏసీలు ఉన్నప్పటికీ వాటి పనితీరు సక్రమంగా లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని వివరించారు. అందుకే వెంటిలేషన్ సక్రమంగా వుండేలా చూసుకోవాలని, లేకుంటే కరోనా ముప్పు తప్పదని హెచ్చరించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఎన్విరాన్‌మెంట్ ఇంటరాక్షన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  ventilation  light  

Other Articles