The Biography Of Balijepali Sailakshmi Who is paediatrician by profession and an eminent social worker

Balijepali sailakshmi biography paediatrician by profession eminent social worker

Balijepali Sailakshmi biography, Balijepali Sailakshmi history, Balijepali Sailakshmi story, Balijepali Sailakshmi life journey, Balijepali Sailakshmi foundation, Balijepali Sailakshmi updates, indian social workers, social workers, ekam foundation

Balijepali Sailakshmi Biography paediatrician by profession eminent social worker : The Biography Of Balijepali Sailakshmi who is the director of Ekam Foundation. As an eminent social worker, she has served lakhs of sick and dying children.

పేదవారైన చిన్న పిల్లలకు వైద్యసేవలందిస్తున్న ఆదర్శ వనిత

Posted: 06/20/2015 04:06 PM IST
Balijepali sailakshmi biography paediatrician by profession eminent social worker

డబ్బు వ్యామోహంలో పడి కన్నవారినే పట్టించుకోని ఈ రోజుల్లో.. ఇంకా ఇతరులను సహాయం చేసే ఆదర్శవంతులు వున్నారంటే నిజంగా గర్వించదగిన విషయం. ఇందుకు ‘బలిజేపల్లి సాయిలక్ష్మి’యే నిదర్శనం. హైదరాబాదులో జన్మించిన ఈమె.. సమాజంలో డబ్బులు లేని పేదపిల్లలకు వైద్యసేవలు అందించడం కోసం ‘ఏకం’ అనే పేరిట ఒక సంస్థను స్థాపించింది. డబ్బులు లేక, వైద్య సేవలు అందించలేక పేద పిల్లలు చనిపోతుంటే, వారి తల్లితండ్రుల ఆవేదనను చూసి ఈమె చలించిపోయింది. ఇక అప్పటినుంచి పేదపిల్లల మరణాలను అరికట్టాలన్న దృఢ నిశ్చయంతో ఈమె వారికోసం ‘ఏకం’ సంస్థను స్థాపించింది. పిల్లల వైద్య సేవలకు ఖర్చుపెట్టలేని వారికి తన సంస్థ ద్వారా సహాయమందించి పిల్లల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపుతూ వస్తోంది.

జీవిత చరిత్ర :

హైదరాబాదులో జన్మించిన సాయిలక్ష్మి.. సికిందరాబాదు సెయింట్ ఆన్స్ కళాశాలలో ఇంటర్, గాంధీ వైద్య కళాశాలలో ఎం.బి.బిఎస్. చదివారు. ఆమె నీలోఫర్ లో పి.జి. చేసి చిన్న పిల్లల వైద్య నిపుణురాలైనారు. ఆమె వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో.. తన పరిసర ప్రాంతాల్లోని పేదవారి పిల్లలు అనారోగ్యంతో వైద్యం అందక, సరైన వైద్యం అందించడానికి తగిన ఆర్థిక వనరులు లేక చిన్న పిల్లలు చనిపోయేవారు. దాంతో తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందేవారు. అది చూసి చలించిపోయిన ఆమె.. వారికేదైనా సహాయం చేయాలని సంకల్పించి తన మిత్రుల సహాయంతో అటువంటి పిల్లలకు వైద్య సహాయము అందించారు. 2009లో తాను చేస్తున్న వైద్య వృత్తిని మానేసి తాను నెలకొల్పిన ‘ఏకం’ అనే సంస్థకే అంకితమై పేద వారైన చిన్నపిల్లల వైద్య సేవలోనే వుంటున్నారు.

జీవింతో సాయిలక్ష్మీ ఎదుర్కొన్న సవాళ్ళు :

ఒకసారి ఇద్దరు చిన్నపిల్లలకు గుండె సమస్య వచ్చింది. దానికి గాను 12 లక్షలు అవసరమైంది. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చాలో తెలియక సతమతమయ్యారు. కాని ఎలాగోలా డబ్బులు సమకూర్చి.. ఆ పిల్లలకు వైద్య సేవలందించి ఈమె ప్రాణాలు నిలబెట్టింది. అప్పుడు ఆ చిన్నారుల చిరునవ్వు, వారి తల్లిదండ్రుల కళ్ళలోని ఆనందాన్ని చూసి ఆమె ఎంతో సంతోషపడింది. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు తమకు పోన్ చేసి తమ బిడ్డ చావు బ్రతుకుల మద్య వున్నాడని, మీ వద్దకు రావడానికి కూడ చార్జీలకు డబ్బులు లేవని చెపుతుంటారు. అలాంటి వారి వద్దకు తమ వద్దనున్న వాలంటీర్లను పంపి.. భోజనము పెట్టించి, చార్జీలిచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి.. వైద్యం చేయించి పంపేవారు. ఆ విధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు గాక ఇప్పటి వరకు 8446 మంది పేదవారైన చిన్న పిల్లలకు మెరుగైన వైద్యాన్నందించారు.

మరిన్ని వివరాలు :

ఈ విధంగా ఈమె చేస్తున్న సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఈమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నారిశక్తి పురస్కారాన్ని ప్రపంచ మహిళాదినోత్సవమైన మార్చి 8న ఇచ్చి సత్కరించింది. పేదవారైన చిన్న పిల్లల ఆరోగ్య విషయములో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నఈమె.. పెళ్లి కూడా చేసుకోలేదు. ఒక సందర్భంలో ఓ మీడియా ప్రతినిధి ‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు’ అని అడగగా.. పిల్లల ఆరోగ్య విషయంలో తీరిక లేకుండా గడుపుతున్న తనకు పెండ్లి విషయమే గుర్తుకు రాలేదని సమాధానమిచ్చారు. ఈమె చేస్తున్న సేవకు స్ఫూర్తిగా కొందరు వైద్యులు కలిసి హైదరాబాదులోనూ ‘ఏకం’ సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balijepali Sailakshmi  ekam foundation  social workers  

Other Articles