b vijayalakshmi biography | indian famous scientists | Women In Science

B vijayalakshmi biography indian famous scientist

b vijayalakshmi, indian famous scientists, b vijayalakshmi biography, b vijayalakshmi life story, b vijayalakshmi history, b vijayalakshmi wikipedia, b vijayalakshmi wiki telugu

b vijayalakshmi biography indian famous scientist : The History Of B Vijayalakshmi Who is an Indian Famous Scientist. For her research she studied relativistic wave equations and their proportions.

అంతర్జాతీయ జర్నల్స్ లో పరిశోధనలను ప్రచురించిన విజయలక్ష్మి

Posted: 05/12/2015 03:38 PM IST
B vijayalakshmi biography indian famous scientist

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతూ ఎందరో భారతీయులు తమ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా ఒకానొక దశలో మహిళలు స్వేచ్ఛలేని మన దేశంలో కొందరు స్త్రీలు ఇక్కడి బానిస సంకెళ్ల నుంచి తమనుతాను విముక్తి చేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. అంతేకాదు.. ఇతర మహిళలకు సైతం చైతన్యం కలిగించి వారికి ఆదర్శంగా చిరకాలం నిలిచిపోయారు. అటువంటి ప్రతిభావంతులైన మహిళల్లో బి.విజయలక్ష్మి ఒకరు! ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త అయిన ఈమె.. అతి చిన్న వయస్సులోనే 11 అంతర్జాతీయ జర్నల్స్ లో తన పరిశోధనలను ప్రచురించారు.

జీవిత విశేషాలు :

విజయలక్ష్మి ఎప్పుడు జన్మించారో ఖచ్చితమైన వివరాలు తెలియరాలేదు. ఈమె బాల్యం నుంచి విద్యలో గొప్ప ప్రతిభను ప్రదర్శించేది. తిరుచ్చినాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, 1974లో మద్రాసు విశ్వవిద్యాలయంలోని థియోరిటికల్ భౌతికశాస్త్ర శాఖలో పి.హెచ్.డి. కోసం చేరారు. ఈ క్రమంలోనే ఆమె పరిశోధనాంశం "Relativistic wave equations and their proportions".

అయితే.. అదేకాలంలో దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. దీంతో విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. వారి పరిశోధనకోసం రావాల్సిన గ్రాంట్లు వచ్చేవికావు. దాంతో పరిశోధనలు కొససాగించడం సమస్యగా మారింది. ఇటువంటి సమయంలోనూ విజయలక్ష్మి తన పరిశోధన మాత్రమేకాక, తోటి విద్యార్ధులకు ‘రిసెర్చి స్కాలర్ల సంఘం’ ద్వారా సహాయం చేస్తూ వుండేది. ఈ విధంగా ఈమె సహాయాన్ని అందించడంతో విశ్వవిద్యాలయ అధికారులకు ఆమె అంతగా నచ్చేది కాదు.

పరిశోధనలు :

1978లో విజయలక్ష్మి తన పరిశోధనలను ప్రారంభించారు. 1980లో ఆమె కొచ్చి విశ్వవిద్యాలయంలోని అటామిక్ ఎనర్జీశాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘ద్వివార్షిక హై ఎనర్జీ భౌతికశాస్త్రం’ సమావేశంలో తన పరిశోధనలను శాస్త్రవేత్తలందరికీ తెలియజేసారు. తర్వాత ఆమె ఆరోగ్యం (క్యాన్సర్ వ్యాధి) క్రమక్రమంగా క్షీణిస్తున్నా.. తాను మాత్రం పరిశోధనలను కొనసాగిస్తూ ఐదు పరిశోధనాంశాలను అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించి, తన పి.హెచ్.డి.ని కూడా పూర్తిచేశారు.

అదే కాలంలో సూపర్ సిమ్మెట్రీ అనే అంశం ప్రాధాన్యత వహిస్తుండేది. దానిగురించి కూడా పరిశోధన చేసిన విజయలక్ష్మి ఐ.ఐ.టి., కాన్పూర్ సందర్శించి కొన్ని నెలలు అక్కడ కూడా పరిశోధన చేశారు. అక్కడ ఆమె కెప్టెన్ లక్ష్మీ సెహ్గల్ ను కలిసారు. ఆవిడ ప్రోత్సాహంతో బెంగుళూరు, ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని ‘సెంటర్ ఫర్ థియేరిటికల్ ఫిజిక్స్’లో మరికొంతకాలం సూపర్ సిమ్మెట్రీ మీద పరిశోధనలను కొనసాగించి, మరో రెండు పరిశోధనాంశాలను ప్రచురించారు.

మరో రెండు సంవత్సరాలు పరిశోధనల కొసం జయరామన్ తో కలిసి ఆమె ట్రీస్టెలోని ICTP వెల్దామనుకుంటున్న తరుణంలో.. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో ఈ మహిళా శాస్త్రవేత్త 32 సంవత్సరాల ప్రాయంలోనే క్యాన్సర్ వ్యాధితో మే 12, 1985 తేదీన మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : b vijayalakshmi  indian famous scientists  women in science  

Other Articles