Chittajallu kanchanamala biography famous telugu actress

chittajallu kanchanamala biography famous telugu actress : chittajallu kanchanamala famous telugu actress. She is the first actress to wear a sleevelss dress in the industry.

తొలితరం నటీమణుల్లో ప్రసిద్ధి చెందిన కాంచనమాల

Posted: 02/02/2015 07:37 PM IST
Chittajallu kanchanamala biography famous telugu actress

తొలితరం చిత్రపరిశ్రమలో తమ నటనద్వారా ప్రేక్షకులను ముగ్ధులను చేసినవాళ్లలో చిత్తజల్లు కాంచనమాల ఒకరు! ఈమె తన అందంతోపాటు నటనాప్రతిభ ద్వారా చిత్రపరిశ్రమలో ఒక చెరగని ముద్ర వేసుకుంది. అప్పట్లో ఈమె నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈమె నటిగానే కాకుండా వ్యక్తిగతంగా గొప్ప వ్యక్తిగా పేరుగాంచారు.

జీవిత చరిత్ర :

1917 మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లాలోని ఆంధ్రాప్యాలెస్’గా పేరొందిన తెనాలి సమీపంలో కూచిపూడి (అమృతలూరు)లో జన్మించారు. ఈమె విశాలనేత్రాలతో, మెరుగైన కేశాలతో ఎంతో అందంగా వుండేది. ఈమె అందానికి ఎంతోమంది దాసోహమయ్యేవారు కూడా! బాల్యం నుంచే ఈమె సంగీతం, నటన మీద ఎక్కువ మక్కువ వుండేది. కుటుంబసభ్యులు కూడా సంగీత నేపథ్యానికి చెందిన వారు కాబట్టి.. ఆవైపుగానే ఈమెకు ఆసక్తి కలిగింది. తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించి పెళ్ళాడారు. తన చిన్నాన దగ్గర నిత్యం సంగీతం నేర్చుకునేది. అలా నేర్చుకుంటూనే ఈమె చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారు.

ఒక చిన్న పాత్ర ద్వారా సినిమాల్లో ప్రేవేశించిన ఈమె అందాన్ని చూసి ముగ్ధులైన సి.పుల్లయ్య చూసి ఈమెకు ‘శ్రీకృష్ణ తులాభారం’ అనే చిత్రంలో మిత్రవింద అనే వేషం వేయించారు. ఆ సినిమాతోనే ఆమె తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈమె కథానాయికగా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే.. ‘గృహలక్ష్మి’(1938)లో మాత్రం వాంప్ పాత్రను పోషించింది. ఆ పాత్రలో కూడా ఆమె పూర్తిగా ఒదిగిపోయి, ప్రేక్షకులను తన నటనతో ముగ్ధుల్ని చేసేసింది.

కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఈమె నటించిన ‘మాలపిల్ల’ చిత్రం విడుదలయ్యింది. ఆ మూవీ రెండో భాగంలో ఆమె విద్యావంతురాలిగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలోనే ఆమె స్లీవ్ లెస్ జాకెట్ ధరించి, చిరునవ్వుతో కాఫీ తాగే సన్నివేశం వుంది. ఆ స్టిల్ ఎన్నో కాలెండర్ల మీద అచ్చాయింది. ఆ విధంగా ఆమె తొలితరం గ్లామర్ క్వీన్’గా పేరు సంపాదించుకున్నారు. ఈమె ఎంత ఫేమస్ అయిందంటే.. అప్పట్లో ఆమె పేరు మీద చీరలు, గాజులు, జాకెట్లు అమ్ముడయ్యేవి. ఈమె నటించిన ఇల్లాలు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ.. నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ఇదిలావుండగా.. ఈమె నటించిన ‘బాల నాగమ్మ’చిత్రం అఖండ విజయం సాధించింది. అయితే ఆ మూవీ తర్వాత ఆమె కళ్లు శూన్యంలోకి చూడటం మొదలుపెట్టాయి. హిందీలో ఎన్నో అవకాశాలు వచ్చినా.. తెలుగు మీద వుండే మమకారంతో ఆ మూవీలన్నింటినీ తిరస్కరించింది. ఆమె బతికి వుండగానే తన స్టార్ ఇమేజ్’ను కోల్పోయింది. ఈ సమయంలోనే భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాధి తో మరణించారు. ఆ బాధతో ఆమె తిరిగి ఏ ప్రయత్నమూ చేయలేదు. చివరగా ఈమె 1981 జనవరి 24 న మద్రాసులో తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh