Pepsico ceo indra nooyi special story inspiration to all the womens and girls a special eassay about indra nooyi

pepsico ceo, indra nooyi, pepsico ceo special ceo, present pepsico ceo, indra nooyi personal life, indra nooyi special essay, indian powerful women

pepsico ceo indra nooyi special story inspiration to all the womens and girls a special eassay about indra nooyi., she is one of top most bussiness women in the world

ఆధునిక ఆదర్శ వనిత ఇంద్రా నూయి

Posted: 12/26/2014 05:17 PM IST
Pepsico ceo indra nooyi special story inspiration to all the womens and girls a special eassay about indra nooyi

ఇంద్రా కృష్ణమూర్తి నూయి అక్టోబర్ 28 న 1955 లో జన్మించిన ఇంద్రా నూయీ ఒక భారతీయ మహిళా వాణిజ్యవేత్త మరియు పెప్సికో ప్రస్తుత ముఖ్య కార్య నిర్వహణాధికారి. ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకున్న ముఖ్య కార్యనిర్వహణాధికారిగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ కథనం ప్రకారం ఈమె ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన 100 మంది మహిళలో ఒకరు.

నేపథ్యము

ఇంద్రా నూయి 1955, అక్టోబరు 28న, తమిళనాడులోని చెన్నై నగరంలో జన్మించారు. ఆమె ఉన్నత విద్యాభ్యాసం, చెన్నైలోని హోలీ ఎంజెల్సు ఆంగ్లో ఇండియను హైయరు సెకండరీ పాఠశాలలో జరిగినది. 1974లో మద్రాసు క్రిస్టియను కళాశాల నుండి భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము మరియు గణితములు పాఠ్యాంశములుగా డిగ్రీ పట్టా పొంది అటు పిమ్మట కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ మేనెజిమెంట్ కాలేజినుండి 1976లో పోస్టు గ్రాడ్యుయేసను డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (ఎం.బి.ఏ) ను పొందారు. ఇంద్రా యొక్క మొదటి ఉద్యోగపర్వం భారతదేశంలోనే ప్రారంభమైనది. జాన్సను అండ్ జాన్సను లోనూ, మెట్టూరు బెర్డుసెల్ నూలుమిల్లులోనూ ఉత్పత్తుల అధికారిణిగా పనిచేశారు. ఆ తరువాత 1978లో ఆమె యేల్ విశ్వవిద్యాలయంలోని యేల్ స్కూల్ ఆఫ్ మేనెజిమెంట్లో చేరి పబ్లిక్ అండ్ ప్రెవేటు మెనేజిమెంటులో మాస్టరు పట్టాను పొందారు. యేల్‌లో వున్నసమయంలోనే ఆమె బూజ్ అల్లెన్ హామిల్టన్ లో సమ్మరు ఇంటర్నుషిప్ను చేసింది. అటుపిమ్మట ఇంద్రానూయి బొస్టన్ కన్సల్టెంట్ గ్రూపులో(BCG)చేరారు. 1980లో యేల్‌లో చదువు పూర్తయిన తరువాత మోటరోలా, ఆసియ బ్రౌన్ బొవెరీ సంస్థలలో కీలకమైన పదవీ బాధ్యతలు నిర్వహించారు.

పెప్సికో కార్యనిర్వాహకత

1994లో పెప్సీకో లో చేరింది. అనతి కాలంలోనే తన ప్రతిభ చూపి 2001 లో ప్రధాన ఆర్థిక నిర్వహణాధికారిగా (CFO ) పదోన్నతి పొందింది. ప్రపంచ వ్యాప్తంగా పెప్సీకో అనేక రంగాలలో కాలుమోపడానికి తన పదునైన వ్యూహాలను ఉపయోగించింది. దశాబ్ధకాలంలో పెప్సీకో దశ, దిశ మార్చి వేసింది. దాదాపు దశాబ్దకాలం పాటు ఆ సంస్థ ప్రపంచ వ్యాప్త వ్యూహాలను మెరుగు పరచడంలోనూ మరియు సంస్థ పునర్నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. ఈమె తెచ్చిన వ్యూహాత్మక మార్పులలో 1997లో పెప్సీకో ఆధీనంలో ఉన్న ఫాస్టుఫుడ్ రెస్టారెంటులను ట్రైకాన్ ఒక కొత్త సంస్థగా విభజించడం ఒకటి. ఈ ట్రైకాన్ సంస్థే ఇప్పుడు యమ్ బ్రాండ్స్ గా మారింది. 1998లో ట్రాపికానాను పెప్సీకో లో విలీనం చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. అలాగే క్వేకర్ ఓట్స్ సంస్థ , గేటరేడ్ యొక్క విలీనాలు కూడా ఈవిడ కృషి ఫలితంగానే జరిగాయి. 44 సంవత్సరాల పెప్సీకో సంస్థ కు ఐదవ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా 2006 లో బాధ్యతలు చేపట్టింది. బిజినెస్ వీక్ పత్రిక కథనం ప్రకారం, 2000 సంవత్సరంలో ప్రధాన ఆర్థికాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత పెప్సీకో రాబడి 72 శాతం వృద్ధి చెందింది.,మరియు లాభాలు రెండింతలయ్యి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

2007 మరియు 2008 సంవత్సరాలలో వాల్‍స్ట్రీట్ జర్నల్ అత్యంత గమనింపదగిన మహిళల జాబితాలో చోటు దక్కించుకొంది. అలాగే టైమ్ పత్రిక అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో 2007 మరియు 2008 లలో స్థానం దక్కింది. 2008లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో ఈమెకు మూడో స్థానం కట్టబెట్టింది. .ఫార్చూన్ పత్రిక 2009 మరియు 2010 లో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఒకటో స్థానంలో నిలిచింది. అక్టోబరు 7, 2010 న ఫోర్బ్స్ పత్రిక ఈవిడను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 6వ స్థానాన్ని కల్పించింది.

పెప్సీ కో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా 2011 లో ఈమె 17 మిలియన్ అమెరికన్ డాలర్లను వేతనంగా పొందింది. ఇందులో 1.6 మిలియన్ డాలర్లు మూల వేతనం కాగా, 2.5 మిలియన్ డాలర్లు నగదు బోనస్ గా మరియు 3 మిలియన్ డాలర్లు భరణం గా పొందింది.

వ్యక్తిగత జీవితము
ఈమె వివాహము రాజ్ కె, నూయి తో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరు గ్రీన్‍విచ్, కనెక్టికట్ లో నివసిస్తున్నారు. పెద్దమ్మాయి యేల్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. నూయి ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన అమ్మల్లో (powerful mother) 3వస్థానంలో నిలిచింది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indra nooyi. powerful women in the world  pepsico  

Other Articles