Sthanapathi rukminamma biography who is famous telugu and sanskrit writer

sthanapathi rukminamma, sthanapathi rukminamma news, sthanapathi rukminamma death day, sthanapathi rukminamma latest news, sthanapathi rukminamma biography, sthanapathi rukminamma life history, sthanapathi rukminamma life story, sthanapathi rukminamma history, sthanapathi rukminamma, telugu literatures, sanskrit literatures

sthanapathi rukminamma biography who is famous telugu and sanskrit writer

‘‘స్వర్ణకంకణం’’గా గుర్తింపుపొందిన ప్రసిద్ధ రచయిత్రి

Posted: 10/29/2014 06:24 PM IST
Sthanapathi rukminamma biography who is famous telugu and sanskrit writer

అలనాటి తెలుగు రచయితల్లో చాలామంది పేర్లు సాధారణంగా ఎక్కువగా బయటకు రాలేదు. మంచిపేరు సాధించినవాళ్లకంటే సంచలన రచయితలు చేస్తూ పేరొందిన వ్యక్తుల పేర్లే ఎక్కువ ప్రసిద్ధి చెందారు కానీ.. కొంతమంది వ్యక్తుల పేర్లు మాత్రం కేవలం పుస్తకాలమేరకే పరిమితమయ్యాయి. అటువంటి రచయితల్లో స్థానాపతి రుక్మిణమ్మ కూడా ఒకరు. ఈమె ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు. అంటే.. ఆనాడు సంస్కృత భాష ఎక్కువ వాడుకలో వున్నందున ఈమె ఆ భాషలో గొప్ప పండితురాలుగా పేరుగాంచింది. అలా పండితురాలుగా కొనసాగుతూనే ఆమె ప్రసిద్ధ రచయిత్రిగా పేరు సంపాదించింది.

జీవిత చరిత్ర :

1915వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో రుక్మిణమ్మ జన్మించింది. ఈమె తండ్రి శ్రీకాకుళం పురుషోత్తమరావు... తల్లి గరుడమ్మ! ఈమె తన బాల్యంనుంచి విద్యాభాసంలో చాలా చురుకుగా వుండేవారు. ఇతర విద్యార్థులకంటే అన్ని విభాగాల్లోనూ ముందుగా వుండేది. అందుకే.. ఈమె పండితురాలుగా ఎదగగలిగింది. అలాగే చిన్నతనం నుంచి కవితలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది. ఆనాటి ఆచారవ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు తగ్గట్టుగానే తనను తాను మలుచుకునే.. ఎంతో గౌరవంగా వుండేది. దేవుడి మీద భక్తి, ఆరాధన ఈమెలో చాలానే వుండేది. ఈమె వివాహం విశాఖ నివాసులు స్థానాపతి సత్యనారాయణతో జరిగింది.

చిన్నతనంనుండే కవితలపై ఆసక్తి వున్న ఈమెకు... 18 ఏళ్ళ వయస్సులోనే మొదటి కవితా సంపుటి వెలువడింది. అందులో ముఖ్యంగా ‘‘దేవీ’’ భాగవతాన్ని సామాన్య పాఠకుల కోసం వ్యావహారిక వచనంలో రచించారు. వివిధ ఉపనిషత్తుల నుండి దైవతత్త్వ ప్రతిపాదకాలైన సూక్తులతో నిండిన ‘‘దేవుడు’’ పుస్తకాన్ని రచించారు. వేదాల నుండి, ఉపనిషత్తుల నుండి కొన్ని ఋక్కులను ఎంపికచేసి తాత్పర్య సహితంగా వచనరూపంలో రచించారు. వీరి రచనలల్లో ముఖ్యమైనవి విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి మొదలైనవి పత్రికలలో ప్రచురించబడ్డాయి. రచయిత్రిగా ఈమెచేసిన కృషికి గుర్తింపుగా 1953 మార్చి 5వ తేదీన ‘‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’’ అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sthanapathi rukminamma  telugu literatures  sanskrit literatures  telugu news  

Other Articles