Blind tv9 anchor swathi biography

anchor swathi, blind anchor swathi, tv9 blind anchor swathi, blind anchor swathi biography, blind anchor swathi news

blind tv9 anchor swathi biography

అందరికీ ఆదర్శంగా నిలిచిన ‘‘అంధ’’మైన యాంకర్!

Posted: 09/18/2014 07:27 PM IST
Blind tv9 anchor swathi biography

(Image source from: blind tv9 anchor swathi biography)

ఆమె పేరు స్వాతి.. పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత తన చూపును కోల్పోయిన ఈమె.. తనకున్న లోటును ఏమాత్రం లెక్కచేయకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ చదువులో మంచి ప్రతిభను కనబరిచింది. ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ చదువు మీద పట్టువదలకుండా మంచి మార్కులతో తన సత్తా చాటుకుంది. అలా ఆ విధంగా చదువులో తనను తాను నిరూపించుకున్న స్వాతి... మీడియా రంగంలో యాంకర్ గా పనిచేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా అటు చదువుతోపాటు ఇటు యాంకరింగ్ లో సమర్థంగా రాణిస్తున్న ఆమె తన ప్రస్థానం గురించి ఇలా వివరిస్తోంది...

‘‘మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న మెకానిక్. బతుకుదెరువుకోసం మెదక్ నుంచి హైదరాబాద్ కు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాం. నేను పుట్టినప్పుడు నా కళ్లు బాగానే వుండేవి. కానీ నా మొదటిపుట్టినరోజు వచ్చిన బంధువులంతా ‘‘అమ్మాయికి మెల్లకన్ను వుంది.. వెంటనే డాక్టర్ కు చూపించండి’’ అని చెప్పగానే అమ్మనాన్న అలాగే చేశారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఏవో ఐడ్రాప్స్ వేశారట.. ఆ తర్వాత ఏం జరిగిందోఏమోగానీ.. తర్వాత నా చూపు నాలుగునెలలకల్లా పూర్తిగా పోయింది. ఇతర డాక్టర్ల దగ్గర చూపించినా.. ఫలితం లేకపోయింది. ఆర్థికపరిస్థితులు అంతంతమాత్రంగానే వున్నా.. అమ్మానాన్న నాకు ఏ లోటు తెలియకుండా పెంచారు. చిన్నప్పుడు బ్రెయిలీ నేర్చుకున్నాను. చూపులేదనే సమస్య నన్ను ఎప్పుడూ వేధించేది. తొమ్మదో తరగతి వరకు అమ్మనాన్న దగ్గరే వుంటూ అంధుల పాఠశాలల్లో చదువుకున్నాను కానీ పదోతరగతి హాస్టల్ లో వుండి చదువుకోవడం వల్ల కష్టాలేంటో తెలిసివచ్చాయి. ఎవరూ నాకు సహాయం చేయకపోవడంతో ఎంతో బాధ కలిగినప్పటికీ.. వాళ్లకంటే బాగా చదువుకోవాలనిపించింది. దాంత పదోతరగతిలో 75 శాతం మార్కులు సాధించాను.

సీఏ చదవాలనే లక్ష్యంతో ఇంటర్ లో సీఈసీ తీసుకున్నాను. హాస్టల్ లో నా పనులు చేసుకుంటూ బాగానే చదువుకునేదాన్ని. మంచి మార్కులు కూడా తెచ్చుకున్నాను. అయితే సాయంగా వచ్చిన స్ర్కయిబ్ కూడా సరిగ్గా రాయకుండా మోసం చేయడంతో చాలా నిరాశపడ్డాను. అయితే అమ్మానాన్న ఇచ్చిన ధైర్యంతో ఇంటర్ లో, అదికూడా ఇంగ్లీష్ మీడియంలో 85 శాతం మార్కులు సాధించాను. ఇంకా పైచదువులు చదవాలంటే ఆర్థికంగా భారమే అవుతుందని భావించిన తరుణంలో నా ఫ్రెండ్ ఇచ్చిన సలహామేరకు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంట్రన్స రాసి, బీఏలో చేరాను. అక్కడ కూడా నేను సాధారణ అమ్మాయిలాగే చదువును కొనసాగించాను. అయితే ఏదో సాధించాలనే తపన నాలో వుండేది. అప్పుడే ఓ ఛానెల్ (టీవీ9) వాళ్లు చూపులేనివాళ్లకు యాంకర్ గా అవకాశం ఇస్తున్నారని తెలిసి.. నా ఫ్రెండ్ నన్ను ఆడిషన్ కు తీసుకెళ్లింది. వాళ్లు ఇచ్చిన ఇన్ స్ట్రక్షన్స్ మేరకు అలాగే ప్రిపేరయి కెమెరాముందు బాగానే చెప్పాను. దీంతో మొత్తం నలభైమందిలో నేనొక్కదాన్నే సెలక్టయ్యాను.

టీవీ9లో ప్రతి శనివారం రాత్రి పదిన్నరకు ప్రసారమయ్యే ‘‘వీకెండ్ సినిమా’’ ప్రోగ్రామ్ కి యాంకర్ గా సెలక్ట్ అయ్యాను. ప్రోగ్రామ్ స్ర్కిప్ట్ ను రెండుమూడు సార్లు చదివి వినిపిస్తే చాలు.. వెంటనే చెప్పేస్తాను. అలా వారంలో ఐదు రోజులు చదువుకుంటూ.. ఒకరోజు యాంకరింగ్ చేస్తున్నాను. అందుకు నాకు నెలకు పదివేలు జీతం కూడా వస్తుంది. అందరూ నా యాంకరింగ్ గురించి బాగా చేస్తావ్ అని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ టీవీలో నన్ను నేను చూడలేకపోతున్నాననే బాధ కలిగిస్తుంది. భవిష్యత్తులో లెక్చరర్ అవ్వాన్నదే నా కోరిక’’ అంటూ పేర్కొంది స్వాతి. సాధారనంగా అందానికే ప్రాధాన్యమిచ్చే ఈ రంగంలో... చూపులేకపోయినా తన ప్రతిభతోనే రాణించడం నిజంగా గర్వించదగిన విశేషమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : blind anchor swathi  telugu anchors  tv9 news channel  movie programmes  

Other Articles