Aishwarya rai bachchan birthday josh special

Aishwarya Rai Bachchan birthday Josh special, Aishwarya Rai Bachchan, Aaradhya Bachchan, Aishwarya Rai Aaradhya, Happy Birthday Aishwarya, Aishwarya Aaradhya, Abhishek Bachchan

Aishwarya Rai Bachchan birthday Josh special, Bollywood actress and mom Aishwarya Rai Bachchan, who is celebrating her 40h birthday today, told reporters that her one-and-half daughter Aaradhya sang Happy birthday to her

ఐష్ అందానికి నలబై ఏళ్లు

Posted: 11/01/2013 06:15 PM IST
Aishwarya rai bachchan birthday josh special

అందానికి నిర్వచనం ఆమె..అందంతో పాటు తన అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది..ఒక ఆర్కిటెక్చర్ అవుదామనుకున్న ఆమె నేడు ఎంతో మందికి ఆరాధ్య దేవత అయ్యింది..సగటు భారతీయురాలిగా నటిస్తూ ఎంతోమందిని ప్రశంసలు అందుకుంది..ఈమెనే 'ఐశ్వర్యరాయ్'. ఐష్ జన్మదినం సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలు...

 

ఒక్కసారి చూస్తే మరోసారి చూడాలని అనిపించే అందం ఆమెది. అందంతో పాటు అభినయం ఉన్న నటి. 1993 సంవత్సరంలో ఓ యాడ్ లో కనిపించిన ఈమె బాలీవుడ్ ఏలుతుందా ? అని ఎవరూ అనుకోలేదు. 1973 నవంబర్ 1వ తేదీన ఐశ్వర్యరాయ్ కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. ఆర్కిటెక్చర్ అవుదామని అనుకుంది. 1994లో ఫోర్డ్ సూపర్ మోడల్ కాంటెస్ట్ విన్నర్ గా నిలిచింది. మిస్ ఇండియా కాంటెస్టులో పాల్గొంది. కాని సుస్మీతా సేన్ ఎదుట నిలువలేక పోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తరువాత ఎలాగైనా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవాలని ఆత్మస్థైర్యం పెంచుకుంది. నిబద్ధత, శద్ధ, అందం ఆమెకు కలిసి వచ్చాయి. 1994లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది.

 అంతే ఒక్కసారిగా అందరి చూపు ఈమెపై పడింది. ఎలాగైనా ఈమెను తమ చిత్రంలో నటించేందుకు ఎంతో మంది దర్శక , నిర్మాతలు క్యూ కట్టారు. చివరకు 1997 సంవత్సరంలో 'మణిరత్నం' సినిమా ద్వారా కోలివుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రెండు పాత్రలు చేసింది. అనంతరం 'ఔర్ ప్యార్ హో గయా' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

 

1998లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జీన్స్' చిత్రంలో ద్విపాత్రాభినయం చేసింది. అందంతో పాటు అభినయం ప్రదర్శించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. 'హమ్ దిల్ చుకే సనమ్' సినిమా ఆమె కు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. అందులో ఆమె చేసిన హావభావాలు ఎంతోమందిని కట్టిపడేశాయి. ఈ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. వెనువెంటనే వచ్చిన 'తాళ' సినిమా ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది. దేశంలోనే కాక విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకుంది.

 

వరుసగా సినిమాలు చేస్తున్నా ఆమెకు సరియైన ఇమేజ్ దొరకలేదు. అందులోనే సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగిస్తోందని అనేక రూమర్స్ వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో 'షారుఖ్' సరసన 'దేవదాస్' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈసినిమాలో ఐష్ ఎలా నటిస్తుందని ఎంతోమంది విమర్శలు గుప్పించారు. వారందరీ నోళ్లకు తాళం పడేలా చేసింది. ఈ సినిమాకు రెందో ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.

 

ఇలా వరుసగా సినిమాలు చేసింది. అకస్మాత్తుగా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2004లో బ్రైడ్ అండ్ ప్రిజుడైస్ సినిమా చేసింది. 2005సంవత్సరంలో బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్' ఆయన కుమారుడు 'అభిషేక్ బచ్చన్' సరసన 'బంటి ఔర్ బబ్లీ' సినిమాలో ఓ ఐటం సాంగ్ చేసి దుమ్ము రేపింది. ఈ సమయంలో అభిషేక్ తో వివాహం చేసుకుంటుందన్న వార్తలు వచ్యాయి. ఎట్టకేలకు 2007లో వివాహం చేసుకుంది. తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఎంతో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ అతిలోక సుందరికి భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డుతో సత్కరించింది...

 

ఇదండీ..ఐష్ జీవితంలోని కొన్ని ఘట్టాలు..40వ వసంతంలోకి అడుగు పెట్టిన 'ఐశ్వర్యరాయ్'కు జన్మదిన శుభాకాంక్షలు..

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles