దేశరక్షణ పరంగా తూర్పు తీరంలో విశాఖ నగరం అత్యంత కీలకమైనది. తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంతోపాటు, హిందుస్థాన్ షిప్‌యార్డు, పోర్టు, స్టీల్‌ప్లాంట్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలకు నెలవైన విశాఖ నగరం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతోపాటు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేందుకు కొన్ని ముష్కర మూకలు దేశంలో ఏదో ఒకచోట అదనుచూసి దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల తదుపరి దృష్టి విశాఖ వంటి ద్వితీయశ్రేణి నగరాలపైన పడే అవకాశం ఉందని పలువురు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ పర్యాటకులతో నిత్యం కళకళలాడే ప్రశాంత నగరం విశాఖలో భద్రత ఏ స్థాయిలో వుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఉగ్రవాద సంస్థల ఉనికే లేదని, ఒకవేళ అలాంటి సందర్భం తలెత్తినా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు పోలీస్ శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నా, ఆ స్థాయిలో భద్రతా చర్యలు కానరాకపోవడం నగర వాసులను ఆందోళనకు గురి చేస్తుందనడంలో సందేహం లేదు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more