Ugadi celebrations atop indrakeeladri

sri durga malleswara swamyvarla, ugadi celebrations atop indrakeeladri, durga malleswara swamyvarla devasthanam, ugadi, telugu new year, celebrations, april 11, bhavani deeksha mandapam, april 21,

Ugadi celebrations atop Indrakeeladri

Ugadi-celebrations.gif

Posted: 04/04/2013 06:16 PM IST
Ugadi celebrations atop indrakeeladri

Ugadi celebrations atop Indrakeeladri

దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20వ తేదీ వరకూ అమ్మవారి వసంత నవరాత్రోత్సవాలు, 21 నుంచి 29 వరకూ చైత్రమాసం బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. వసంత నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆశీర్వచన మండపములో లక్షపుష్పార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి రోజుకు ఒక రకము గల ఉత్తమ జాతి పూలతో అర్చన చేస్తారు.  మల్లెపువ్వులు, పచ్చ చామంతి పువ్వులు, గులాబి పువ్వులు, కనకాంబరం పువ్వులు, మరువం, తామరపువ్వులు, మారేడు దళములు, జిల్లేడుపువ్వులు, తులసి దళములు, మందార పువ్వులు, తెల్ల చామంతి, కలువ పువ్వులు, కాగడా మల్లెపువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న భక్తులు రూ.1116 రుసుం చెల్లించి టికెట్ తీసుకోవల్సి ఉంటుందన్నారు. ఉగాది రోజు.. ఉగాది పర్వదినం సందర్భంగా11న తెల్లవారు జామున 2.30 గంటలకు స్నపనాభిషేకం. అనంతరం ఎనిమిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారన్నారు. ఉదయం 10 గంటలకు భవానీ దీక్షా మండపంలో పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు. సాయంత్రం 5.30 గంటలకు వెండి రథోత్సవం, ప్రచార రథంతో జమ్మిదొడ్డి నుంచి ప్రారంభించి పాతబస్తీ బ్రాహ్మణవీధిలో నుంచి శ్రీనివాస మహల్ సెంటర్ వరకు, తిరిగి వన్‌టౌన్ మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్, కాళేశ్వరరావు మార్కెట్, వినాయక గుడి, రథం సెంటర్ మీదుగా కొండపైకి చేరుతుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One more shock to chandrababu naidu
Police checking in prakasam barrage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more