Case filed on donate us website in ttd annadanam

case filed on donate us website in ttd annadanam, Forest Officials warned Tirupati Hackers to Vacant their Places

case filed on donate us website in ttd annadanam, Forest Officials warned Tirupati Hackers to Vacant their Places

టిటిడిలో అన్నం పేరుతో శఠగోపం- అటవీశాఖ హెచ్చరిక

Posted: 10/21/2013 08:08 PM IST
Case filed on donate us website in ttd annadanam

తిరుమలలో ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న 78మంది హ్యాకర్లను ఖాళీ చేయాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. వారం రోజుల్లోగా షాపులన్నీ ఖాళీ చేయాలని గడువుపెట్టారు. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా టిటిడి ఎస్టేట్ అధికారి దేవేంద్రరెడ్డితో గోడు చెప్పుకున్నారు. దీంతో ఈ విషయాన్ని టిటిడి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

 

తిరుమలకు మొట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులకు .. ఒక సంస్థ అన్న దానం చెయ్యటానికి ముందుకు రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ వెంకన్న భక్తులకు శఠగోపం పెట్టింది. దాతల నుంచి విరాళాలు సేకరించి 18 నెలల పాటు శ్రీవారి మెట్లమార్గంలో భక్తులకు అన్నదానం చేసిన సంస్థ వారం రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయింది. ఈ సంస్థ దాతల నుంచి కోట్ల రూపాయ లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. తమది పేరున్న ఓ మఠానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ అని, శ్రీవారి మెట్లమార్గంలో భక్తులకు అన్నదానం చేస్తామంటూ అక్షయ ఫౌండేషన్ టీటీడీ వద్దకు వచ్చింది.

 

 

టీటీడీకి అనుబంధం అంటూ ‘డొనేట్ అజ్’ అనే స్లోగన్‌తో ఓ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసింది. సంస్థ నిర్వాహకుడు బాలరాజు అలియాస్ బాలాజీదత్ శ్రీవారిమెట్ల మార్గంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ప్రారంభించారు. దీనికి అప్పటి ఈవో, జేఈవోలు ఎల్వీ సుబ్రమణ్యం, వెంకటరామిరెడ్డితో, ట్రస్టుబోర్డు చైర్మన్ బాపిరాజు కూడా హాజరయ్యారు. తర్వాత అన్న ప్రసాదాలను అందజేసే విధానాన్నీ వీడియోలో చిత్రీకరించి, ఆ వీడియోలను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు పంపి దాతల నుంచి భారీగా విరాళాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

 

 

కర్ణాటక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు లక్షల రూపాయల విరాళాలు ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడి నుంచి రూ.15 లక్షలు విరాళంగా తీసుకోగా, అనుమానం వచ్చిన ఆ భక్తుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించడంతో అక్షయ ఫౌండేషన్ బండారం బయటపడింది. కాగా, అక్షయ ఫౌండేషన్ విరాళాలు సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని విజిలెన్స్ ఉన్నతాధికారి చెప్పారు. కేసు నమోదు చేశామని, సేకరించిన విరాళాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై టిటిడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles