Actor nitin reddy visit in tirupati

actor nitin, nitin reddy visit in tirupati gunde jaari gallanthayyinde,ollywood film actor, gunde jaari gallanthayyinde movie release,

actor nitin reddy visit in tirupati

కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న నటుడు నితిన్

Posted: 04/18/2013 08:38 PM IST
Actor nitin reddy visit in tirupati

సినిమా భారీ విజయం సాధించాలనే ఉద్దేశంతో .. ఈ మద్య కాలంలో సినీ నటులు, దర్శకుడు, నిర్మాతలు సినిమా విడుదలకు ముందు రోజు దేవుళ్ల పై ఆదారపడుతున్నారు. బాద్ షా సినిమా విడుదలకు ముందు రోజు దర్శకుడు శ్రీను వైట్ల కూడా తిరపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే హీరో నితిన్ కూడా ఈ సారి స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే నితిన్ రెడ్డి కాలినడకన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యింది' చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ చిత్ర విజయవంతం కావాలని కోరేందుకే తాను తిరుమలను సందర్శించినట్లు నితిన్ చెప్పారు. త్వరలో 'కొరియర్ బాయ్' అనే చిత్రంలో నటించబోతున్నట్లు నితిన్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles