The Making Tips of Mutton Butter Keema Masala Recipe | Kitchen Tips | Food Recipes

Mutton butter keema masala recipe making methods kitchen tips

butter keema masala recipe, mutton keema recipe, mutton keema masala making tips, mutton keema recipe making methods, muttong recipes, chicken recipes, ramzan special recipes, ramzan month, ramzan special festival, ramzan festival foods

Mutton Butter Keema Masala Recipe Making Methods Kitchen Tips : The Making Tips of Mutton Butter Keema Masala Recipe In Home Which Is Called As Nutrient Food Item.

బటర్ ఖీమా మసాల.. ఓ న్యూట్రీషియన్ రిసిపీ

Posted: 07/07/2015 11:25 AM IST
Mutton butter keema masala recipe making methods kitchen tips

‘రంజాన్’ పవిత్రమాసంలో ముస్లింలు చేసుకునే వెరైటీ వంటకాల్లో ‘బటర్ ఖీమా మసాల’ ఒకటి. పోషక విలువలు అధికంగా వుండే పదార్థాలతో ఈ రిసిపీని తయారుచేస్తారు కాబట్టి.. దీనిని ఆరోగ్యకరమైన ఆహారంగా పేర్కొంటారు. ఈ కర్రీని ఇతర రిసిపీలతో పోల్చితే ఇదెంతో రుచికరంగా వుంటుంది. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. పూర్తిగా ‘డైట్ ప్రొటీన్ ఫుడ్’ అయిన ఈ రిసిపీని బయట రెస్టారెంట్స్, హోటళ్ల తినడం కంటే ఇంట్లో తయారుచేసుకుని తీసుకోవడమే ఎంతో శ్రేయస్కరం. మరి.. దీనిని ఎలా తయారచేస్తారో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు :

మటన్ : 1kg;
పెరుగు : 1cup;
బటర్ : 1cup;
అల్లం పేస్ట్ : 3tsp;
వెల్లుల్లి పేస్ట్ : 3tsp;
ఉల్లిపాయలు : 3 పీసెస్;
లవంగాలు : 5-7;
దాల్చిన చెక్క : 1;
బ్లాక్ యాలకలు : 2;
గ్రీన్ యాలకలు : 2;  
పచ్చిమిర్చి : 8;
బిర్యానీ ఆకు : 1;
ఉప్పు : రుచికి సరిపడా;
కారం : 3tsp;
కొత్తిమీర తరుగు : కొద్దిగా

తయారుచేయు విధానం :

* ముందుగా బటన్ ముక్కలను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఓ ఫ్రైయింగ్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అనంతరం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిసేపటివరకు బాగా ఉడికించుకోవాలి.

* మరోవైపు ఇంకొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో ఖీమా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇదివరకు సన్నగా తరిగిపెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి.. మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అనంతరం ఈ ఖీమా మిశ్రమానికి కొద్దిగా బటర్ జోడించి.. మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ.. వేడి చేస్తూ వుండాలి. కొద్దిసేపు మీడియం మంటలో ఉడికించుకోవాలి.

* ఇలా తయారుచేసుకున్న ఖీమా మిశ్రమానికి ముందుగా తయారుచేసుకొన్న మసాలా మిశ్రమం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసి.. డ్రై అయ్యే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. మంట తగ్గించి, పెరుగు వేసి ఖీమా మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి,  ఎండు మిర్చి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ ఖీమా మసాలా రెడీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : butter keema masala  mutton keema masala  ramzan special recipes  

Other Articles

  • Chicken garelu cooking tips which is special weekend food

    నోరూరించే చికెన్ గారెల తయారీ...

    Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more

  • Chicken lollipops cooking tips best healthy food recipes

    చికెన్ లాలీ పాప్స్ ని ఎలా చేస్తారో తెలుసా..?

    Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more

  • Butter garlic fish fry recipe cooking methods kitchen tips

    బట్టర్ గార్లిక్‌తో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో తెలుసా?

    Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more

  • Rice vada cooking method kitchen tips

    బియ్యపు పిండితో వేడివేడి వడలు..

    Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more

  • Chicken garelu recipe cooking tips healthy food items nov veg

    చల్లని వెదర్ లో హాట్ చికెన్ గారెలు..

    Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more