విశ్వంలో జీవించే ప్రతిఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే జీవితాంతం సుఖంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. ఆరోగ్యంగా వుండటం అంటే.. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా, మానసిక స్థితులకు లోనవకుండా నిత్య ఆరోగ్యంగా వుంటూ.. తను చేసే కార్యకలాపాలలో తృప్తి చెందడం అన్నమాట!
ప్రాచీనకాలంలో మన పూర్వీకులు ఇటువంటి సమస్యలను అధిగమించడానికి నిత్యం ధ్యానం చేసేవారు. అలా చేయడం ద్వారా ఆత్మకు జ్ఞానం లభిస్తుందని, వారిలో వున్న శక్తిసామర్థ్యాల గురించి తెలుసుకోగలుగుతారని చెబుతుంటారు పురోహితులు. అయితే ప్రస్తుతకాలంలో ఇది మెడిటేషన్ అనే పేరుతో పిలవబడుతుంది.
మెడిటేషన్ చేయడం అంటే.. మనమేంటో, మన గురించి క్లుప్తంగా తెలుసుకోవడం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇతర ఆలోచనలు చేయకుండా, 15 నుంచి 20 నిముషాలవరకు ప్రశాతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మనలో వున్న మానసిక ఒత్తిళ్లు బయటకు వెళ్లిపోయి.. చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం వేళగాని, సాయంత్రంవేళగాని మెడిటేషన్ లో కూర్చుంటే.. మనకు విశ్రాంతి లభించడమే కాకుండా ఎల్లప్పుడూ సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగించవచ్చు.
మెడిటేషన్ ను అలవరుచుకోవడానికి రెండు సాధారణమైన పద్ధతులు వున్నాయి. అవేమిటంటే... మీరు ఒక కొవ్వత్తి ముందు కూర్చొని దానివైపే 15 నుంచి 20 నిముషాలవరకు చూడండి. లేదా ఏదైనా ఒక పదాన్ని 20 నిముషాలవరకు ఉచ్ఛరిస్తూ వుండండి. చాలు.... ఇలా చేస్తే మెడిటేషన్ చేసినట్లే.
ఉదాహరణకు... మనం అనుకోకుండా కోపానికి గురయినప్పుడు ఏదైనా ఒక పదాన్ని ఉచ్చరిస్తూ వుంటే.. అప్పుడు మనలో వుండే కోపం నశించిపోతుంది. దాంతో మనసులో వున్న ఒత్తిడి కూడా దూరం అవుతుంది. ధ్యానపూజ్యుడయిన గౌతమ బుద్ధుడు కూడా ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలంటే ధ్యానం చేయాల్సిందేనని చెబుతాడు.
ధ్యానం చేసే పద్ధతి.....
మీరు ధ్యానం చేయాలనుకుంటే.. ముందుగా మీరు కూర్చున్నప్పుడు వీపును నిటారుగా, సౌకర్యవంతంగా పెట్టుకోవాలి. అలా కూర్చున్న తరువాత కళ్లు మూసుకొని, చాలా తేలికగా శ్వాస పీలిస్తూ వుండాలి. మీరు శ్వాస తీసుకోవడం, బయటకు వదలడాన్ని శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఇలా రోజు 15 నుంచి 20 నిముషాలవరకు మనసులో వున్న ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోతుంది. అయితే ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతంగా వున్న స్థలాన్ని ఎంచుకుంటే చాలా మంచిది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more