Summer Health Benefits of Radish | healthy home remedies | Health Tips

Summer health benefits radish healthy home remedies foods

radish health tips, radish health benefits, radish health news, radish dehydration news, radish summer benefits, radish health updates, healthy foods, healthy home remedies

Summer Health Benefits Radish healthy home remedies : The Health Benefits of Radish which helps to overcome dehydration problem in summer. It contains number of nutrients.

వేసవిలో ఆరోగ్యానికి మేలుచేసే ‘ముల్లంగి’

Posted: 05/13/2015 04:57 PM IST
Summer health benefits radish healthy home remedies foods

వేసవికాలంలో సూర్యునితాపం ఎక్కువగా వుండటం వల్ల రకరకాల వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. అయితే.. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే నిత్యం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా ప్రకృతిపరంగా లభించే ఆహారాల్లో మానవ శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు (మినరల్స్, ఖనిజాలు, విటమిన్లు, ఇతర న్యూట్రియెంట్లు) నిల్వవుంటాయి. అటువంటి వాటిల్లో ముల్లింగి కూడా ఎన్నో ఔషధగుణాలతో నిండివున్న పోషకాహారంగా వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ ముల్లంగిలో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీ-యాక్సిడెంట్స్ వంటి న్యూట్రీషన్స్ అధిక మోతాదులో వున్నాయి. అలాగే క్యాన్సర్ కణాలతో పోరాడే పోషకాలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఇన్ని ఔషధగుణాలు నిండి వున్న ఈ ముల్లంగిని ఉడికించి తీసుకుంటే.. శరీరానికి కావలసిన పిండి పదార్థాలు లభిస్తాయి. అలాగే సలాడ్స్ రూపంలో.. నాన్ వెజ్‌లో నచ్చిన విధంగా ఈ ముల్లంగిని తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే ముల్లంగి డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

ముఖ్యంగా ముల్లంగిని వేసవిలో ముల్లంగి తీసుకుంటే శరరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడి.. చల్లగా మార్చుతుంది. ముల్లంగిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే వేసవి తాపం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే చర్మ సంరక్షణకు కూడా ముల్లంగి దివ్యౌషధంగా పనిచేస్తుంది. డ్రై స్కిన్‌కు ముల్లంగి చెక్ పెడుతుంది. ముల్లంగిలోని వాటర్ కంటెంట్, విటమిన్ సి, ఫాస్పరస్ ధాతువులు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ముల్లంగిలో పుష్కలంగా వున్న పోషక విలువలు :
* కార్బొహైడ్రేట్ : 3.4 గ్రా
* విటమిన్ బి6 : 0.071 మి. గ్రా
* విటమిన్ సి : 14.8 మి. గ్రా
* క్యాల్షియం : 25 మి. గ్రా.
* ఐరన్ : 0.34 మి.గ్రా.
* మెగ్నీషియం : 10 మి. గ్రా.
* మాంగనీస్ : 0.069 మి.గ్రా.
* పొటాషియం : 233 మి. గ్రా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radish health benefits  Healthy Home remedies  health tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more