Health tips to sleep well home remedies

health tips, sleeping tips, tips to sleep well, sleeping tips food, sleeping food items, healthy food sleep, sleeping healthy food, tips to sleep well at nights

health tips to sleep well home remedies ; the healthy foods to sleep well at nights who has facing problems in their lives

నిద్రమత్తులో జారిపోయేలా చేసే ఆహారాలు

Posted: 12/03/2014 05:13 PM IST
Health tips to sleep well home remedies

ప్రస్తుతం సాంకేతికయుగంలో ప్రతిఒక్కరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఆఫీసు కార్యకలాపాలతోబాటు ఇంటి పనులను కూడా నిర్వర్తించుకోవడంలో ఎక్కువ సమయం వాటికే కేటాయించాల్సి వుంటుంది కాబట్టి.. అధిక ఒత్తిడికి గురవుతారు. తద్వారా హాయిగా నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. అదికూడా కేవలం ఐదారు గంటలవరకు మాత్రమే! తర్వాత మళ్లీ అవే తంటాలు, తిప్పలు! ఇలా చేస్తే.. ఎన్నో అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.

మానవ శరీరానికి కనీసం 7 నుంచి 9 గంటల వరకు విశ్రాంతి అవసరం. అంటే నిద్ర! ఎన్ని సమస్యలున్నాగానీ ఖచ్చితంగా నిద్రపోవాలి. అయితే నేటియుగంలో నిద్రలేమితో చాలావరకు బాధపడుతున్నారు కాబట్టి.. అటువంటివారిని నిద్రమత్తులోకి జారిపోయేలా చేసే కొన్ని ఆహారాలు అందుబాటులో వున్నాయి. అందులో వుండే పోషక విలువలు ప్రశాంతతతో కూడిన నిద్రతోబాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడం, బీపి అదుపులో ఉండటం, చర్మానికి మెరుపు.. ఇలా అన్నిరకాలుగా మేలు చేస్తాయి. మరి.. అవేమిటో తెలుసుకుందాం..

1. గుడ్డు : ఇందులో శరీరానికి కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. రాత్రినిద్రపోయే సమయంలో ఒక్కగుడ్డు తీసుకుంటే.. అందులో వున్న ప్రోటీన్లు శరీరంలో శక్తిని పెంచుతాయి.

2. పాలు : ఇందులో ట్రిస్టోఫాన్ అనే అమైనో ఆమ్లంతోబాటు క్యాల్షియం అధిక మోతాదులో వుంటాయి. ఇవి శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని పెంచడంతోబాటు ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. పెరుగు, నెయ్యి కూడా ఇలాగే పనిచేస్తాయి.

3. పాలకూర : ఇందులో పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా వుంటాయి. ఇవి ఒత్తిళ్లు, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పుల వంటి బాధల నుంచి తీవ్ర ఉపశమనం కలిగించి, త్వరలో నిద్రలోకి జారిపోయేలా చేస్తాయి.

4. చెర్రీలు : వీటిలో మెలనిన్ అనే రసాయనం వుంటుంది. అది శరీరంలోని అవయవాల పనితీరును సక్రమంగా జరిగేలా కీలకపాత్రను పోషిస్తుంది.

5. బాదం : ఇందులో మెగ్నీషియం అధికస్థాయిలో వుంటుంది. ఇది కండరాలను విశ్రాంతిపరిచి, సుఖనిద్రలో జారిపోయేలా చేస్తుంది. అలాగే బాదంలో ప్రోటీన్లు కూడా అధికంగా వుంటాయి. ఇవి రక్తంలోని చక్కెరస్థాయిలను అదుపులో వుంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

6. వేరుశెనగ : ఇందులో వుండే నియాసిన్ వల్ల శరీరంలో సెరటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిళ్ళన్నింటి నుంచి విముక్తి కలిగించి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. కాఇవేకాకుండా మెలటోనిన్, ట్రిప్టోఫాన్ అధికంగా లభించే వాల్ నట్స్ కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

7. అరటిపండ్లు : కండరాల్ని విశ్రాంతి పరిచే మెగ్నీసియం, పొటాషియం వంటి ఖనిజాలు అరటిపండ్లలో వుంటాయి. అలాగే ఈ పండ్లలో నిద్రకు సహాకరించే విటమిన్ బి6, కార్భోహైడ్రేట్లు ఉంటాయి. విటమిన్ బి6 నిద్రకు ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా మాయిగా నిద్రపడుతుంది.

8. హెర్బల్ టీ : చామొమైల్ టీ లేదా గ్రీన్ టీలలో ఉండే రసాయనాలు శరీరంలోని కండరాలు, నరాలను రిలాక్స్ చేసి ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తాయి.

9. ద్రాక్షపండ్లు : వీటిలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. అలాగే వీటిలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లెవనాయిడ్లు మొదలైనవి అధిక మొత్తంలో ఉంటాయి.

10. చాక్లెట్ : దీనిలో ట్రిప్టోఫాన్, ఫినైల్ థైలమైన్, మెగ్నీషియం వంటివి ఖనిజాలు వుంటాయి. ఇవి నిద్రలేమిని దూరం చేయడంలో సహాయపడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  sleeping tips  home remedies  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more