నిత్యజీవితంలో పురుషుల కంటే మహిళలే రోజంతా ఎక్కువ శ్రమిస్తుంటారు. ఉదయాన్నే లేవగానే పిల్లలకోసం, భర్తకోసం భోజనాలు రెడీ చేయడం, ఇంట్లో పనులు పూర్తిగా నిర్వర్తించుకోవడం, ఆఫీసుకు వెళ్లడం, ఇతరత్ర కార్యకలాపాలు చేసుకోవడం లాంటివి బోలెడన్ని పనులు వుంటాయి. అంటే.. ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునేవరకు మహిళలు పనిమనిషిలాగే ఇంటిపనులను సవ్యంగా పూర్తి చేస్తుంది. ఇలా చేయడం వల్ల వాళ్లు తమ ఫిట్ నెస్ ను కోల్పోవడంతోపాటు ఆరోగ్య సమస్యలకు గురవుతారు. అలాకాకుండా మహిళలు నిత్యం తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తూనే ఫిట్ నెస్ గా, ఆరోగ్యవంతంగా వుండాలంటే అద్భుతమైన పోషకాలు నిల్వవుండే ఆహారాలను తీసుకోవాలి. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం...
1. కెరొటినాయిడ్స్ నిల్వవుండే పదార్థాలు : పసుపు - ఎరుపు రంగుల్లో వుండే పండ్లలో, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా వుంటాయి. ఇవి మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలను తగ్గించడంలో ప్రముఖపాత్రను పోషిస్తాయి.
2. కాలిఫ్లవర్ : ఇందులో స్త్రీలకు అవసరమైన విటమిన్-బి పుష్కలంగా వుంటుంది. ఇది డెలివరీ సమయంలో మహిళలకు కావలసిన శక్తిని అందిస్తుంది. అలాగే ఇందులో విటమిన్-సి, కాల్షియమ్ కూడా సమృద్ధిగా వుంటాయి. పైగా ఫ్యాట్ కంటెంట్ సున్న.
3. క్యారెట్స్ : ఇందులో విటమిన్-ఏ సమృద్ధిగా లభిస్తుంది. ఇది చర్మసౌందర్యాన్ని అందించడంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
4. బీన్స్ : ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా వుంటుంది కాబట్టి కొలెస్టిరాల్ సమస్య వుండదు. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే గుండె పనితీరు బాగుంటుంది.
5. పాలు : ఇందులో విటమిన్-డి, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. పాలను ప్రతిరోజూ తీసుకుంటే.. మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే ఆస్తియో ఆర్థరైటిస్ ను తగ్గతుంది. అలాగే పీఎంఎస్ సమస్య కూడా తగ్గుతుంది.
6. ఓట్స్ : ఓట్స్ లో మహిళలకు కావాలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. దీనిని నిత్యం తీసుకుంటే.. బిపి నుంచి మధుమేహం దాకా ఒక మంచిమందులా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకుంటే పుట్టే శిశువుకు జన్యులోపాల సమస్య తగ్గుతుంది.
7. చేపలు : వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల వరకు అన్నింటినీ నివారించడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి.
8. టొమాటో : వీటిలో లైకోపీన్ అనే మూలకం రొమ్ముక్యాన్సర్ ను నివారించడంలో కీలకపాత్ర వహిస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు గుండెజబ్బుల సమస్యలను తగ్గిస్తుంది.
9. తోటకూర : శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు ఎక్కువ మోతాదులో వుంటాయి. అలాగే ఇందులో వుండే మెగ్నీషియం ఫ్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more