the healthy food items to stay health for long life without facing any problems | healthy foods | foods for health

Healthy food items to stay health for long life

healthy foods, healthy food items, foods for health, best foods for health, remedies for health, healthy home remedies

healthy food items to stay health for long life : the healthy food items to stay health for long life without facing any problems.

మెరుగైన ఆరోగ్యానికి కావలసిన చిట్కాలు

Posted: 11/14/2015 03:58 PM IST
Healthy food items to stay health for long life

వాతవారణంలో వచ్చే మార్పుల కారణంలో చిరుజబ్బుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తద్వారా వివిధ రకాల అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వుంటుంది. వీటిని అధిగమించి నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి శక్తిని అందించే ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దైనందిన ఆహారంతోపాటు, కొన్నిరకాల ఆహారపదార్థాలను ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతంది.  తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్‌తో పాటు, శక్తిని ఇచ్చే ఫ్యాట్స్ కూడా అవసరమే. ఎక్కువ వేడిగా ఉండే పదార్ధాల కంటే ఒక మోతాదులో ఉండేవే ఆరోగ్యదాయకం.

జొన్నలు : వారానికి ఒక్కసారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కండరాల కదలిక బాగా ఉంటుంది. శీతాకాలంలో బాధించే ఒళ్లు నొప్పులను జొన్న ఆహారం ద్వారా సమర్ధంగా ఎదుర్కోవచ్చు. జొన్నతో చేసిన పదార్ధాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దూరంగా ఉంటాయి.

నువ్వులు : నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్ధాలను తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. అనేక చర్మ సమస్యలకు నువ్వులు దివ్యౌషధం.

చిలగడ దుంపలు : ఇవి శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని ఇస్తాయి. పిల్లలు, వయోధికులకు ఎంతో అవసరం. వీటిలోని పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, సి లు, ఖనిజ లవణాలు, మాంగనీస్, రాగి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే ఆ మజాయే వేరు.

వేరుసెనగలు : వేరుసెనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచిది. వేరు సెన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది.

దానిమ్మ : రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్‌లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి... అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి. హృద్రోగాల నుంచి దానిమ్మ రక్షిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy food items  home remedies for health  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more