Finally Stylish Star Allu Arjun Has Given On Bollywood Entry | Telugu Film Industry | Bollywood Heroes

Stylish star allu arjun clarity on bollywood entry telugu film industry

allu arjun news, allu arjun star diary, allu arjun updates, allu arjun latest news, allu arjun bollywood entry, allu arjun latest news, allu arjun photos, allu arjun rudramadevi movie

Stylish Star Allu Arjun Clarity On Bollywood Entry Telugu Film Industry : Finally Stylish Star Allu Arjun Has Given On Bollywood Entry.

బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బన్నీ

Posted: 10/12/2015 02:51 PM IST
Stylish star allu arjun clarity on bollywood entry telugu film industry

‘గంగోత్రి’ సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లుఅర్జున్.. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరుగాంచాడు. ఇక అప్పటినుంచి తన టాలెంట్ తో సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమలో వున్న స్టార్ హీరోల్లో ఒకడిగా తన పేరును నమోదు చేసుకున్న బన్నీ.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు వున్నాయని గతకొన్నాళ్ల నుంచి అభిప్రాయాలు వెల్లువడ్డాయి. ఈమధ్య సౌత్ హీరోలు కొందరు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే బన్నీ కూడా హిందీ సినిమాల్లో నటించే ఛాన్స్ వుందని వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా తన బాలీవుడ్ ఎంట్రీపై బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ నేపథ్యంలో బన్నీ మాట్లాడుతూ.. ‘ఓ హీరో టాలీవుడ్ నుంచి ఓ హీరో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ సాధించడం చాలా కష్టమైన పని. దాని కోసం తను ఇక్కడ 10 సంవత్సరాల కెరీర్ ని పణంగా పెట్టాలి. అంటే.. తెలుగు సినిమాల మీద దృష్టి సారించకుండా బాలీవుడ్ పైనే ఫోకస్ చేయాలి. అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా కాకుండా బాలీవుడ్ నుంచి ఏదైనా మంచి ఆఫర్స్ వస్తే చెయ్యాలి. లేదా ఒక మంచి సినిమాలో అక్కడి హీరో ఇక్కడి హీరో కలిసి చేస్తే బాగుంటుంది. దాంతో మార్కెట్ కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటే.. తెలుగు సినిమా స్థాయి కూడా భారీగా పెరుగుతుంది’ అని బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు. అంటే.. తాను సోలో హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేనంటూ ప్రత్యక్షంగానే క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా.. బన్నీ తెలిపిన అభిప్రాయం నిజమేనని, సౌత్ హీరోకి అక్కడ స్థానం సంపాదించడం కాస్త కష్టమే అవుతందని చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ‘రుద్రమదేవి’ చిత్రంలో బన్నీ చేసిన ‘గోనగన్నారెడ్డి’ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఆ చిత్రంలోనే స్పెషల్ హైలైట్ గా బన్నీ నిలిచాడని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరైనోడు’ చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  bollywood  rudramadevi  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more