Director Koratala Siva Gets Audi A6 Car As Gift From Mahesh Babu For Srimanthudu Success | Srimanthudu Updates

Koratala siva gets gift of audi a6 car from mahesh babu

koratala siva news, mahesh babu news, mahesh babu with koratala siva, mahesh babu updates, koratala with mahesh, mahesh gifts koratala, mahesh car gift to koratala, mirchi movie, srimanthudu success

Koratala Siva Gets Gift Of Audi A6 Car From Mahesh Babu : Director Koratala Siva Gets Audi A6 Car As Gift From Mahesh Babu For Giving Him Biggest Hit With Srimanthudu Movie.

మహేష్ నుంచి భారీ కానుక పొందిన కొరటాల

Posted: 09/22/2015 12:44 PM IST
Koratala siva gets gift of audi a6 car from mahesh babu

టాలీవుడ్ లో రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. ‘మిర్చి’ సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో కొరటాల ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇతనితో కలిసి పనిచేసేందుకు మహేష్ సుముఖత వ్యక్తం చేశాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా సైతం మంచి విజయం అందుకోవడంతోపాటు సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతేకాదు.. ఇంతవరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ‘శ్రీమంతుడు’ మరో ఎత్తు అని సినీ, రాజకీయ ప్రముఖులు ఆ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందుకు కారణం దర్శకుడు కొరటాల శివ కాబట్టి.. అతనికి తనదైన రీతిలో మహేష్ శుభాకాంక్షలు తెలుపుకున్నాడు.

‘శ్రీమంతుడు’ చిత్రం అఖండ విజయాన్ని అందుకోవడంతో మహేష్ క్రేజ్ మార్కెట్ లో మరింత పెరిగిపోయింది. వివిధ చిత్రపరిశ్రమల నుంచి కూడా మహేష్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రం అన్నివర్గాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు కూడా! దీంతో గతకొంతకాలం నుంచి సక్సెస్ లేకుండా పరితపిస్తున్న మహేష్ కు ‘శ్రీమంతుడు’ రూపంలో ఘనవిజయాన్ని అందించినందుకు ఖరీదైన ‘ఆడి ఎ6’ కారును కానుకగా ఇచ్చి.. తన అభిమానాన్ని చాటుకున్నాడు. తొలుత అతనికి ఫోన్ చేసి జూబ్లీమిల్స్ లోని ఆడి షోరూమ్ దగ్గరికి రావాల్సిందిగా ఫోన్ చేశాడు. అంతే.. శివ వెంటనే అక్కడికి చేరుకోగానే ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మహేష్ నవ్వుతూ ఎదురొచ్చి.. అక్కడున్న ‘ఆడి ఎ6’ కారును చూపిస్తు దాని ‘కీస్’ శివ చేతిలో పెట్టాడు. అంతే.. శివ ఆనందంతో పొంగిపోయాడని అంటున్నారు. ఎంతో ఖరీదైన ఆడి కారును తనకు గిఫ్టుగా ఇచ్చినందుకు మహేష్ కు కొరటాల థ్యాంక్స్ చెప్పుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala siva  mahesh babu  audi a6 car  srimanthudu success  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more